Home వార్తలు మంచుతో ముచ్చటగా మూడోసారి

మంచుతో ముచ్చటగా మూడోసారి

hansikaదేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి హిట్ చిత్రాల్లో విష్ణు మంచు సరసన నటించిన బబ్లీ బ్యూటీ హన్సిక ముచ్చటగా మూడోసారి అతనితో జతకట్టనుంది. రాజ్‌కిరణ్ దర్శకత్వంలో విష్ణు మంచు, హన్సిక హీరోహీరోయిన్‌లుగా ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘లక్కున్నోడు’. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ “విభిన్న చిత్రాల్లో నటిస్తూ వస్తున్న విష్ణు మంచుతో మా బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈడో రకం-ఆడో రకం వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు నటిస్తున్న చిత్రమిది. ఈ లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌లో బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్‌గా నటించనుంది. ఆమె పాత్రను ఎంతో గ్లామరస్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు మాటలు, స్క్రీన్‌ప్లేను సమకూర్చగా పి.జి.విందా సినిమాటోగ్రఫీ, మధు ఎడిటింగ్ వర్క్‌ను అందిస్తున్నాడు”అని తెలిపారు.