Tuesday, January 31, 2023

దేవసేనకు మంత్రిగా ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ

- Advertisement -

Anushka-Prudhvi-Raj

‘థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’ అంటూ ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క డైలాగ్‌తో టాలీవుడ్‌లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్ననటుడు పృథ్వీరాజ్. అప్పటి నుంచి థర్టీ ఇయర్స్ పృథ్వీగానే పాపులరైన ఆయన ఈ మధ్యలో హీరోగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఆ సినిమా ఊహించనంత విజయం సాధించలేదు.
కాగా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్.150’లో బ్రహ్మనందం పాత్రకు స్కోప్ పెంచడం కోసం పృథ్వీ పాత్రను కట్ చేశారనే వార్తలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. అయితే తాజాగా పృథ్వీ తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఓ సూపర్ న్యూస్‌ను వెలువరించాడు. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించిన ‘బాహుబలి-ది బిగినింగ్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌’లో పృథ్వీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడటా. చిత్రంలో ‘కుంతల’ రాజ్య మహారాణి దేవసేన(అనుష్క)కు ముఖ్య మంత్రి పాత్రలో తాను నటించినట్లు పృథ్వీ తెలిపాడు. ‘ఇది కామెడీ పాత్ర కాదని, చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్ర’ అని పేర్కొన్నాడు. అయితే బాహుబలి చిత్రానికి సంబంధించి ఓ నటుడు పబ్లిక్‌గా ఇలా తమ పాత్ర గురించి బయటకి చెప్పడం ఇదే తొలిసారి. మొత్తానికైతే పృథ్వీ పెద్ద లక్కీ ఛాన్స్ కొట్టేశాడనే అపిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles