Home Default సూర్యాపేటలో త్రిదండి జీయర్‌స్వామి తిరునక్షత్ర వేడుకలు

సూర్యాపేటలో త్రిదండి జీయర్‌స్వామి తిరునక్షత్ర వేడుకలు

Thirunakshatram Celebrations Held In Suryapetసూర్యాపేట : త్రిదండి జీయర్‌స్వామి తిరునక్షత్ర (జన్మదినం) వేడుకలు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో ఆండాళ్‌ గోష్ఠి, వికాసతరంగిణి ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. ఆధ్యాత్మిక రంగంలో జీయర్‌స్వామి చేస్తున్న సేవలను మంత్రి కొనియాడారు. అనంతరం నిరుపేద మహిళలకు మంత్రి చీరలు పంపిణీ చేశారు.  ఈ వేడుకల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఉప్పల లలితా ఆనంద్‌, పట్టణ టిఆర్‌ఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాల సైదులుగౌడ్‌, పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్ , ఉప్పల ఆనంద్, కక్కిరేని నాగయ్య గౌడ్, మహిళా టిఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కరుణశ్రీ , ఆండాళ్ గోష్ఠి, వికాస తరంగణి సభ్యులు శ్రీరంగం వల్లి, హైమావతి, పద్మ, ఉప్పల గోపాల కృష్ణ, విజయ్ కుమార్, శంకర్, రాము, వెంపటి రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.