Home నాగర్ కర్నూల్ ఫ్రెండ్లీ పోలీసా? లేక ఎనిమీ పోలీసా?

ఫ్రెండ్లీ పోలీసా? లేక ఎనిమీ పోలీసా?

వాహన దారులతో నోటిదురుసు తనం
పోలీసుల వైఖరి పట్ల ప్రజల్లో అసహనం

Friendlly-Police

నాగర్‌కర్నూల్‌ప్రతినిధి: ఫ్రెండ్లీ పోలీసిం గ్‌తో నేరాల అదుపులో సామాన్య ప్రజల సహకారం తీసుకో వాలంటూ ఒక వైపు జిల్లా ఎస్పీ ప్రజలకు సందేశాలు ఇస్తూ ఆ దిశగా మేము మారుతాం, మిమల్ని మారుస్తాం, ఆచరిస్తాం, ఆచరింపజేస్తాం అంటూ తనదైన శైలిలో ముందడుగు వేస్తుం డగా క్రింది స్థాయి పోలీసు అధికారులు మాత్రం మేమం మారము గాక మారబోము అంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మాటేలా ఉన్నా నోటి దురుసు తనంతో ప్రజల్ని రెచ్చగొడు తున్నారు. ఇక నిబంధనలు అమలుకే మేమం పరిమితం, ఆచరణ మాత్రం మీరే అంటున్నారు.

యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో కొంత కాలంగా ట్రాఫిక్ నిబంధనల పేరున పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో అసంతృప్తి రెకెత్తిస్తుండగా శుక్రవారం రద్దీ వేళ వేలాది మంది చూస్తుండగా ఖాకీల బహిరంగ చేతి వాటం రెడ్ హ్యాండెడ్‌గా కెమెరాలకు చిక్కడం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిం ది. పోలీసు లంఛాల బాగోతం ఒక అంశం కాగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకించి విధులకు వేస్తున్న అధికారుల వైఖరి వివాదస్పదంగా మారిందన్నది పలువురి భావన.

ఎందుకీ అసహనం

ట్రాఫిక్ నిబంధనల అమలు కోసం డ్యూటీ చేస్తున్న అధికా రులలో తీవ్ర అసహనం వ్యక్తంఅవుతుంది. చట్ట పరిధిలో వా హనాల చట్టం మేరకు ఛలాన్లు విధించడంలో ఎవ్వరూ వీరిని తప్పు బట్టాల్సిన పనిలేదు. ఆ క్రమంలో సదరు అధి కారుల వైఖరి మాత్రం తీవ్ర అభ్యంతర కరంగా ఉండటం వాహన దారుల్లో పోలీసు శాఖ పట్ల వ్యతిరేకత కల్గిస్తుంది. నాగర్ కర్నూల్‌లో ట్రాఫిక్ కోసం ప్రత్యేక పోలీసు విభాగం లేదు. సివిల్ రెగ్యూలర్ అధికారులనే తాత్కలికంగా ట్రాఫిక్ విధు ల్లోకి పంపిస్తున్నారు. సదరు అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో పని చేస్తుండగా వారి వ్యవహార శైలి సరిగ్గా లేక పోవ టం, ఆరోపణలు రావటంతో ప్రజల ఫిర్యాదులు, అంత ర్గత విచారణల నేపధ్యంలో వారిలో మార్పు తెచ్చేందుకు స్టేష న్ విధుల నుండి మార్చి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్‌లో వీఆర్ లో ఉంచుతున్నట్లు తెలిసింది.

వారిలో మార్పు మాటేలా ఉన్నా కేటాయించిన విధుల్లో సైతం వివాదస్పదంగా వ్యవహ రించడం వృత్తి పట్ల వారికున్న నిబద్దత తెలియజేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనదారుల పట్ల దురుసు గా ప్రవర్తించడం, వాహనాల వెంట పరుగెత్తి తాళం చెవిలు లాక్కోటం, ఎవరైనా ఏ పరిస్థితుల్లో తాము బయటకు రావా ల్సి వచ్చిందో చెప్పేందుకు ప్రయత్నించినా ఒకటి రెండు సెక్ష న్‌లు అదనంగా జోడించి జరిమాన పెంచటం పరిపాటీగా మారిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. హెల్మెట్ లేకుం డా ప్రయాణించే వారికి జరిమాన విధించడం ఒకే అయినా పోలీసులంటే భయంతో పరుగెత్తి వారిని వెంబడించే విధానం తో వాహనదారుడికి ఏదైనా ప్రమాదం జరిగితే సదరు అధికారి బాద్యత వహిస్తాడా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నా రు. రెగ్యూలర్ విధుల నుండి తప్పించారన్న శాఖపరమైన ఆక్కసుతో వారి ఆగ్రహం, ఆక్రోషం, ఆసహనం ప్రజలపై చూ పడం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాక ప్రజల్లో ఎనిమీ పోలీస్ అన్న భావన తలెత్తె అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడు తున్నారు.

తనిఖీల పేరుతో ట్రాఫిక్ జామ్

ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు తనీఖీల పేరున చేస్తున్న హంగామా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు దారితీస్తుందన్న భావన వ్యక్తం అవుతోంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పెషల్ ట్రాఫిక్ పోలీసులు, సాయంత్రం 7 గంటల నుండి రాత్రి వరకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారులు తనీఖీలు నిర్వహిస్తు న్నారు. తనిఖీల పేరిట పోలీసులను ట్రాఫిక్ జామ్ చేస్తున్నారన్న విమర్శలు పట్టణ ప్రజల నుంచి వ్యక్త మౌ తున్నాయి.