Thursday, April 25, 2024

గతేడాదితో పోల్చితే ఈసారి వర్షాలు అధికం

- Advertisement -
- Advertisement -
This time the rainfall is higher in Telangana
రాజన్న సిరిసిల్లా జిల్లాలో అధికంగా 1413.7 మి.మీల వర్షపాతం నమోదు
రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లోని 130 మండలాల్లో భారీ స్థాయిలో వర్షపాతం
21 జిల్లాలోని 266 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదు
గణాంకాలను వెల్లడించిన స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ

హైదరాబాద్: గతేడాదితో పోల్చితే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి సీజన్‌లో కురిసిన వర్షాల్లో రాజన్న సిరిసిల్లా జిల్లాలో అధికంగా 1413.7 మి.మీల వర్షపాతం నమోదయ్యిందని, ఇది సాధారణం కంటే 67 శాతం అధికంగా కురిసినట్లు స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (అక్టోబర్ 16వ తేదీ వరకు) గణాంకాలను వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లోని 130 మండలాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదవ్వగా, 21 జిల్లాలోని 266 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రికార్డు అయినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. సాధారణంగా జూన్ 1 నుంచి అక్టోబరు 16 వరకు ఉండే నైరుతి రుతుపవనాల సీజన్‌లో సగటు వర్షపాతం 784.3 మి.మీలు ఉండగా, గతేడాది 2020, -21సంవత్సరానికి గాను 1,211.6 మి.మీల వర్షపాతం కురిసిందని అధికారులు తెలిపారు. కానీ, ఈ సారి అక్టోబర్ 16వ తేదీ నాటికి 1047.6 మి.మీల వర్షం కురిసిందని ఆ శాఖ తమ గణాంకాల్లో వెల్లడించింది. గతంతో పోల్చితే ఈ సారి 34 శాతం అదనంగా వర్షాలు పడ్డాయని అధికారులు తెలిపారు.

నైరుతి సీజన్‌లో ఇలా…

నైరుతి రుతుపవనాల సీజన్‌లో అధికంగా సిరిసిల్ల జిల్లాలో 1,413.7 మి.మీల (81 శాతం) నమోదవ్వగా, ఆ తర్వాత సిద్దిపేట జిల్లాలో 1,177.9 మి.మీలు, వరంగల్ అర్భన్‌లో 1,281.1 మి.మీలు, కరీంనగర్‌లో 1,246.2 మి.మీలు, నారాయణపేట జిల్లాలో 7,93.2 మి.మీల వర్షపాతం కురిసింది. ఈ ఐదు జిల్లాల్లోని 130 మండలాల్లో సాధారణం కంటే 60 శాతం ఎక్కువ వర్షాలు పడ్డట్లు ప్లానింగ్ సోసైటీ పేర్కొంది. అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో 1426.0 మి.మీలు, వరంగల్ రూరల్ లో 1290 9 మి.మీలు, రంగారెడ్డిలో 831.5 మి.మీలు, నిర్మల్ లో 1437 మి.మీలు, జనగాంలో 1043.1 మి.మీలు, భువనగిరిలో 880.6 మి.మీలు, జగిత్యాలలో 1278.5 మి.మీలు, కామారెడ్డిలో 1254.6 మి.మీలు, మహబూబ్ నగర్‌లో 765.5 .మీలు, మహబూబాబాద్‌లో 1,148 4మి.మీలు, ఆదిలాబాద్‌లో 1428.5 మి.మీలు, మేడ్చల్‌లో 834.9 మి.మీలు, హైదరాబాద్‌లో 832.5 మి.మీలు, నల్గొండలో 762.3 మి.మీలు, కొమురం భీం జిల్లాలో 1408.6 మి.మీలు, వికారాబాద్‌లో 906.3 మి.మీలు, కొత్తగూడెంలో 1240 మి.మీలు, మెదక్‌లో 997.4 మి.మీలు, వనపర్తిలో 614.9 మి.మీలు, జయశంకర్ భూపాలపల్లిలో 1194.7 మి.మీలు, ఖమ్మంలో 1056.9 మి.మీల వర్షపాతం రికార్డు అయ్యిందని, ఈ జిల్లాల్లో సాధారణంతో పోల్చితే 20 శాతం నుంచి 59 శాతం వర్షాలు అధికంగా కురిశాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News