Saturday, April 20, 2024

హెచ్-1బి వీసాల జారీకి ఈ ఏడాది లాటరీ విధానమే

- Advertisement -
- Advertisement -

This year's lottery process for issuance of H-1B visas

 

డిసెంబర్ 31 వరకు ట్రంప్ పద్ధతి వాయిదా

వాషింగ్టన్: భారత్‌సహా ఇతర దేశాల ఉద్యోగులకు జారీ చేసే హెచ్-1బి వీసాల విషయంలో ట్రంప్ తెచ్చిన నూతన విధానాలను ఈ ఏడాది డిసెంబర్ 31వరకు వాయిదా వేస్తున్నట్టు జో బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ విధానానికి ముందు అమలులో ఉన్న లాటరీ విధానాన్ని కొనసాగిస్తామని బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్రంప్ తెచ్చిన నూతన విధానంలో ఎంపిక ప్రక్రియకు అవసరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థను తీసుకురావడానికి ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీకి మరింత సమయం పడుతుందని తెలిపింది.

హెచ్-1బి వీసాల జారీలో ట్రంప్ నూతన విధానానికి ముందు కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతి అమలులో ఉండేది. ఆ విధానంలో సమూల మార్పులు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. విదేశీ ఉద్యోగులకు గరిష్ఠ వేతనస్థాయి, నైపుణ్యం ఆధారంగా వీసాలు ఇచ్చేలా ట్రంప్ సవరణ చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 7న అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ(యుఎస్‌సిఐఎస్) ఓ ప్రకటన చేసింది. దాని ప్రకారం మార్చి 9 నుంచి కొత్త(ట్రంప్) విధానం అమలులోకి వస్తుందని తెలిపింది. తాజాగా బైడెన్ తీసుకున్న నిర్ణయంతో అది వాయిదా పడింది. దీనికి సంబంధించిన అధికారిక(ఫెడరల్) నోటిఫికేషన్ ఈ నెల 8న రానున్నది.

అమెరికాలో ఉద్యోగాల కోసం ఏటా ఆ దేశానికి విదేశాల నుంచి లక్షల దరఖాస్తులు వస్తూ ఉంటాయి. వాటిలోంచి గరిష్ఠంగా 65,000 ఎంపిక చేసి హెచ్1 బి వీసాలను యుఎస్‌సిఐఎస్ మంజూరు చేసేది. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లేవారికి మరో 20,000 వరకు హెచ్1బి విద్యార్థి వీసాలను జారీ చేసేది. అయితే, ఈ విధానం ద్వారా అమెరికాలోని కంపెనీలు చౌకగా వచ్చే విదేశీయులకు ఉద్యోగాలు కల్పిస్తూ స్వదేశీయుల్ని నిర్లక్షం చేస్తున్నాయని భావించిన ట్రంప్ ప్రభుత్వం లాటరీ పద్ధతిని రద్దు చేసింది. ఇప్పుడు అదే లాటరీ పద్ధతిని బైడెన్ ప్రభుత్వం తాత్కాలికంగా పునరుద్ధరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News