Friday, April 19, 2024

త్వరలో తెలుగులో సినిమా చేసి.. హిందీలో రీమేక్ చేస్తా: వరుణ్ ధావన్

- Advertisement -
- Advertisement -

వరుణ్ ధావన్, కృతిససన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భేడియా. ఈ చిత్రం తెలుగులో తోడేలు టైటిల్‌తో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతుంది. ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగులో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత దినేష్ విజన్ మాట్లాడుతూ “ఈ సినిమాను అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈనెల 25న విడుదలయ్యే ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది” అని అన్నారు.

మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “బాహుబలి సినిమా తరువాత తెలుగు, హిందీ, సౌత్, నార్త్ అని ఎల్లలు తీసేశాం. మంచి సినిమాను ఎక్కడున్నా చూడటం అనేది ఒక కల్చర్‌గా మారింది. నిర్మాత దినేష్ విజన్… పుష్ప సినిమా కంటే ముందే అల్లు అర్జున్ పెద్ద స్టార్ అవుతాడని నమ్మి అతనితో సినిమా చేయడానికి వచ్చారు. భవిష్యత్తులో ఆయన అల్లు అర్జున్‌తో సినిమా తీయాలని కోరుకుంటున్నాను. వరుణ్ నువ్వు హిందీలో సినిమా చేస్తే తెలుగులో డబ్ చేయడం కాదు. నువ్వు గీతా ఆర్ట్‌లో సినిమా చేస్తే ఆలిండియాలో డబ్ చేసి రిలీజ్ చేద్దాం. ఈ సినిమాలో కొంత భాగం చూసే అవకాశం నాకు కలిగింది. ఈ సినిమాలో ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలు ఉన్నాయి.

ఈ సినిమాను తెలుగులో విడుదలచేయడం మంచి అవకాశంగా ఫీల్ అవుతున్నాను”అని పేర్కొన్నారు. వరుణ్ ధావన్ మాట్లాడుతూ “ఇండియాలో చాలామంది టాలెంట్ ఉన్న వ్యక్తులు ముంబయ్, హైదరాబాద్‌కి చెందిన వాళ్ళే. మనం వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు కానీ మనందరం ఇండియన్స్. క్రికెట్‌లో ఏ ప్లేయర్ అయినా స్కోర్ చేస్తే ఇండియా స్కోర్ చేస్తుంది అనే చెబుతాం. అలానే సినిమా కూడా. నేను త్వరలో తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా. తోడేలు సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కృతి సనన్ పాల్గొన్నారు.

Thodelu Movie Pre Press Meet in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News