Thursday, February 2, 2023

ఇఎస్‌ఐలో వెయ్యి కోట్ల శ్కాం

- Advertisement -

esi-scam ఏటా 250 కోట్లు అవినీతి గుర్తించిన ఎసిబి
70 డిస్పెన్సరీలలో ఎసిబి సోదాలు
ఫార్మా కంపెనీలపై కొనసాగుతున్న దాడులు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇఎస్‌ఐ కుంభకోణంలో రూ. 1000 కోట్ల మేర మందుల కొనుగోళ్లు జరిగినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తులో గడిచిన నాలుగేళ్ళలో ఏటా సుమారు రూ. 250కోట్ల మందులు కొనుగోలు చేసినట్లుగా ఎసిబి ఆధారాలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల వద్ద తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచల నం సృష్టించిన ఇఎస్‌ఐ కుంభకోణం దర్యాప్తులో భాగం గా.. పలు మెడికల్ ఏజెన్సీ కార్యాలయాల్లో కూడా ఇప్పటికీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.

ఇప్పటి వరకు ఈ శ్కాంలో మొత్తం 8 మందిని అరెస్టు చేయగా, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక దర్యాప్తులో భాగంగా బుధవారం ఓమ్ని మెడి ఉద్యోగి నాగరాజుల ఇంట్లో రూ.46 కోట్ల నకిలీ ఇండెంట్లు దొరకడంతో అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. దొరికిన నకీలి ఇండెట్లపై పలువురు ఇఎస్‌ఐ ఉద్యోగుల సంతకాలు ఉన్నట్లు ఎసిబి దర్యాప్తు బృందం గుర్తించింది. ప్రైవేటు వ్యక్తుల ఇళ్లతో పాటు పలు అధికారుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించిన ఎసిబి అధికారులు అనతికాలంలో ఇఎస్‌ఐ శ్కాంకు సం బంధించి మరికొంత మంది అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

తెలంగాణలో సంచలనం సృష్టించిన కార్మిక వైద్య బీమా సేవల సంస్థ మందుల కొనుగోలు కుంభకోణంలో రోజుకో కొత్తకోణం బయటపడుతోంది. ఆ విభా గం అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, కొందరు ప్రైవే టు వ్యక్తులు కలిసి భారీగా దండుకున్నట్టు అనిశా అధికారులు గుర్తించారు. ఏడాదికి రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లలో దాదాపు రూ. వెయ్యి కోట్ల మేర ఔషధాల కొనుగోళ్లు జరిగినట్లు అధికారుల విచారణలో తేలింది. దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు.. ఈ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 70 డిస్పెన్సరీల నుంచి వివరాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేశారు.

మరికొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్ ఏజెన్సీల కార్యాలయాల్లో అనిశా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఒమ్ని మెడి ఉద్యోగి నాగరాజు ఇం ట్లో రూ.46 కోట్ల విలువైన నకిలీ ఇండెంట్లకు సంబంధించి ఇఎస్‌ఐ ఉద్యోగుల సంతకాలను సైతం సేకరించారు. ఆ విభాగం అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, కొందరు ప్రైవేట్ వ్యక్తులు కలిసి భారీగా దండుకున్నట్టు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా దేవికారాణి ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి ప్రభు త్వ ధనాన్ని దిగిమింగసాగిందని ఎసిబి విచారణలో తేలింది. బినామి మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చేతులు కలిపి మందులు సరఫరా కానప్పటికీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినట్లు గుర్తించారు.

మందుల వైద్య పరికరాల స్టాక్ ఎంట్రి రికార్డులో తన చేతి వాటం చూపుతూ దశల వారీగా ఏటా రూ.200 కోట్ల మేర అక్రమంగా ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. ఇఎస్‌ఐ మెడికల్ డిస్పెన్సరీలకు కేవలం రూ. 10వేల మందులు సరఫరా చేసి రూ.1 బిల్లులకు సృష్టించి సర్కారు ఖజానాను కొల్లగొట్టిందని, అలాగే మందుల కంపెనీల నుంచి 20శాతం కమీషన్ సైతం తీసుకుందని విచారణలో వెలుగుచూసింది. అలాగే మెడిసన్ సప్లై బిల్లులోనూ 5 శాతం తీసుకున్నట్లు తేలింది.

ఈ క్రమంలో ఒకే సంవత్సర కాలంలో రూ.300 కోట్ల మందులను బినామీ కంపెనీల నుంచి కొనుగోలు చేసిందని, ఈ నేపథ్యంలో 2014 నుంచి 2018 మధ్య కాలంలో రూ. 700 కోట్ల మందులను బినామీ కంపెనీలకు అప్పగించినట్లు గుర్తించారు. కాగా 2018 జూలైలో ఒక్కసారిగా నకిలీ బిల్లులు సమర్పించి రూ.60కోట్లు అబిడ్స్‌లోని పే అండ్ అకౌంట్స్ విభాగం నుంచి రహస్యంగా తరలించినట్లు ఎసిబి విచారణలో గుర్తించారు. ఇందుకు కార్యాలయ అటెండర్, క్లర్క్, సూపరింటెండెంట్‌లు కీలక పాత్ర వహించారని ఎసిబి అధికారుల విచారణలో వెలుగుచూసింది.

ప్రభుత్వ నిధుల విడుదలపై ఆరా..!

ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా దేవికారాణి విధులు చేపట్టిన కాలంలో ప్రభుత్వం దాదాపు 700 కోట్ల రూపాయలు కేవలం మందుల కొనుగోలుకు విడుదల చేసినట్లు తేలింది. ఈక్రమంలో 2015, 2016 కాలంలో ప్రభుత్వం రూ. 143 కోట్లు, 2016,2017 కాలంలో రూ. 120 కోట్లు. 2017 నుంచి 2018లో రూ. 208 కోట్ల రూపాయల మేర బడ్జెట్ నుంచి నిధులను విడుదల చేసినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేసిన నిధులపై ఎసిబి అధికారులు విచారణ సాగిస్తున్నారు.

ESi Scam Update

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles