Home జాతీయ వార్తలు ఒడిస్సాలో వెయ్యి కిలోల గంజాయి పట్టివేత

ఒడిస్సాలో వెయ్యి కిలోల గంజాయి పట్టివేత

Thousand Kgs Cannabis Seized In Odishaఒడిస్సా: ఒడిస్సాలో పోలీసులు వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉదయగిరి జిల్లా నుంచి యుపిలోని వారణాసికి ఉల్లిగడ్డల లోడుతో వెళుతున్న ట్రక్ ను శనివారం పోలీసులు తనిఖీ చేశారు. ట్రక్కులో ఉల్లిగడ్డలతో పాటు 1,056 కిలోల గంజాయి ఉందని, ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అనురాగ్, నికిల్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని వారు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు.