Home జాతీయ వార్తలు మైకా గనుల్లో వేలాది బాలకార్మికులు

మైకా గనుల్లో వేలాది బాలకార్మికులు

Child-labour
న్యూఢిల్లీ : జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని మైకా గనుల ప్రాంతాల్లో దాదాపు ఐదు వేల మంది పిల్లలు చదువుకు దూరమై బాలకార్మికులు గా మారి తమ కుటుంబాల సంపాదనకు తోడ్పడుతున్నారు. వీరంతా ఆరు నుంచి పద్నాలుగేళ్ల లోపు బాలలే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డు రైట్స్ (ఎన్‌సిపిసిఆర్) జార్ఖండ్ లోని కొడెర్మా, గిరిడి, బీహార్‌లోని నవడా జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ టెర్రెడేస్ హోమ్స్ గత ఏడాది జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో మైకా గనుల ప్రాం తాల్లో 22,000 మంది కన్నా ఎక్కువ మంది బాలకార్మికులు పనిచేస్తున్నారని, తమ కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పడతున్నారని అధ్యయనంలో బయటపెట్టింది. ఈ సర్వే తరువాత ఎన్‌సిపిసిఆర్ ఆ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లోనే సర్వే చేసింది. జార్ఖండ్‌లో ఆరేళ్లు నుంచి పధ్నాలుగేళ్ల లోపు బాలలు 4545 మంది అలాగే బీహార్ లోని నవడా జిల్లాలో 649 మంది బాలలు పాఠశాలలకు దూరంగా ఉంటున్నారని సర్వేలో వెల్లడైంది. కొడెర్మా లోని 45 నివాస ప్రాంతాల నుంచి, గిరిడి లోని 40 నివాస ప్రాంతాల నుంచి, నవాడా లోని 15 ప్రాంతాల నుంచి పిల్లలు మైకా ముక్కలు ఏరుకోడానికి వెళ్తుండడం వారి దినచర్యగా మారిందని సర్వే కనుగొంది.

ప్రపంచం మొత్తం మీద మైకా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో జార్ఖం డ్, బీహార్ రాష్ట్రాల్లోనే మైకా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వివిధ రంగాల్లో మైకా వినియోగమవుతోంది. భవన నిర్మాణాల్లో, ఎలెక్ట్రానిక్స్‌లో, కాస్మోటిక్స్, పెయింట్స్‌లో మైకా వాడకం కీలకం. మైకా గనులు, పరిశ్రమలు బాలకార్మికులకు విముక్తి కల్పించాలని ఆశిస్తోంది. మైకా మైనింగ్ ఏరియాల్లో చదువుకు దూరంగా ఉన్న పిల్లలకు అందుబాటులో రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు వంటివి అందుబాటులో ఉండేలా చూడాలని సిఫార్సు చేసింది. గిరిడి, కొడెర్మా జిల్లాల్లో పిల్లలు పౌష్టికాహారంతో బాధపడుతున్నారని కూడా ఎన్‌సిపిసిఆర్ వెలుగు లోకి తెచ్చి ంది. గిరిడిలో 14 శాతం, కొడెర్మాలో 19శాతం నవాడాలో 69 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్నారని వివరించింది. పోషణ్ అభియాన్ స్కీమ్ కింద అంగన్వాడీలు, ఆరోగ్యకార్యకర్తలు, చురుకుగా చొరవ తీసుకుని పౌష్టికాహార లోపం సమస్యను నివారించడానికి ప్రయత్నించ వలసి ఉందని ఎన్‌సిపిసిఆర్ సూచించింది.

Thousands of child labour in mica mines