Home అంతర్జాతీయ వార్తలు ఆ ఒప్పందంతో వేలాది ఉద్యోగాలు

ఆ ఒప్పందంతో వేలాది ఉద్యోగాలు

స్పైస్‌జెట్‌కు కృతజ్ఞతలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు  

మోడీ పర్యటనలో భారత్ విమానసంస్థ గురించి ప్రస్తావించిన ట్రంప్

Trump-Spiceవాషింగ్టన్ : భారత్‌లో బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతోంది. రెండేళ్ల క్రితం రుణాల భారంతో ఈ సంస్థ నష్టాలపాలై.. మూసి వేసే స్థాయికి చేరుకుంది. కానీ ఇప్పుడు ఇది టర్న్‌ఎరౌం డ్ సంస్థగా మారింది. తక్కువ సమయంలోనే స్పైస్‌జెట్ నష్టాల నుంచి తేరుకోవడమే కాకుండా అత్యధిక లాభాల దిశగా పయనిస్తోంది. ఇటీవల బోయింగ్ నుంచి విమాన కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది. అసలు విషయా నికొస్తే అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసినవేళ అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ స్పైస్‌జెట్ గురించి గుర్తుచేశారు. ఇటీవల భారత్ విమాన సంస్థ కొత్త విమా నాలకు ఆర్డర్ ఇచ్చిందని, దీనివల్ల అమెరికాలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయన అన్నారు. జనవరి నెలలో అమెరికాకు చెందిన బోయింగ్ కు స్పైస్‌జెట్ 22 బిలియన్ డాలర్ల విలువచేసే ఆర్డర్‌ను ఇచ్చింది. ఈ ఆర్డర్‌తో అమెరికా 1.32 లక్షల మంది ఉపాధి పొందనున్నారని అంచనా వేస్తున్నారు. వైట్‌హౌస్ రోస్ గార్డెన్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్ సమావేశ సమయంలో స్పైస్‌జెట్ కొత్త విమానాల ఆర్డర్ గురించి ట్రంప్ ప్రస్తావించారు. స్పైస్‌జెట్‌తో ఒప్పందంలో భాగం గా 737 మ్యాక్స్ మోడల్‌కు చెందిన 40 విమానాలను స్పైస్‌జెట్‌కు బోయింగ్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇటీవల పారిస్‌లో జరిగిన ఎయిర్‌షోలో ఇరు కంపెనీల కు చెందిన ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకు న్నారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికాలో భారీ సంఖ్య లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పైస్‌జెట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బోయింగ్ నుంచి 205 విమానా లను కొనుగోలు చేయనున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలో స్పైస్‌జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో 40 కొత్త 737 మ్యాక్స్ 10 విమానాల కోసం జూన్ 19న బో యింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్డరు విలువ 470కోట్ల డాలర్లు. అలాగే 50 బొంబార్డియర్ క్యూ400 విమానాల కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం సంస్థ వద్ద 35 బోయింగ్, 20 బొంబార్డియర్ విమానాలున్నాయి.
ప్రపంచంలో ఉత్తమ స్టాక్‌గా స్పైస్‌జెట్
స్పైస్‌జెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ విమాన సంస్థగా పేరును దక్కించుకుంది. బ్లూమ్‌బర్గ్ వెల్లడించిన ప్రకారం, ఎయిర్‌లైన్ స్టాక్‌లో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఈ సంస్థ నిలిచింది. స్పైస్‌జెట్ స్టాక్ 124 శాతం పెరిగి ఇంకా వృద్ధి దిశగా పయనిస్తోంది. ఈ ఏడాది ఎయిర్‌లైన్ స్టాక్‌పై బ్లూమ్‌బర్గ్ నివేదికలో స్పైస్‌జెట్ ప్రపంచంలోనే టాప్‌గా నిలిచింది. 2017లో ఈ స్టాక్ విలువ 124 శాతం పెరిగింది. 2014 డిసెంబర్ నుంచి చూస్తే ఈ సంస్థ స్టాక్ 800 శాతం మేరకు వృద్ధిని సాధించింది. ప్రస్తుతం స్పైస్‌జెట్ మార్కెట్ విలువ 1.2 బిలియన్ డాలర్లుగా ఉంది. చౌకధరల్లో విమాన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో 2005లో స్పైస్‌జెట్‌ను ప్రారంభిం చారు. గత రెండున్నరేళ్ల క్రితం ఈ విమానయాన సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దాదాపు 2.2 బిలియన్ డాలర్ల ఇంధన బకాయిలతో ఒకానొక దశలో మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ఈ కష్టాలను అధిగమించిన ఈ సంస్థ త్వరగా పుంజుకుంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు కొత్తకొత్త ఆఫర్లు ప్రవేశపెట్టింది.