Home హైదరాబాద్ వేసవి దొంగలొస్తారు సుమా..!

వేసవి దొంగలొస్తారు సుమా..!

THEFT

తాళంవేసిన ఇళ్ళే లక్షం
పగటివేళల్లో పనికోసమంటూ తిరుగాడటం
తెల్లవారుజామునే చోరీలు
ప్రత్యేక నిఘా ఏర్పాటులో పోలీసులు

మన తెలంగాణ/ సిటీబ్యూరో: వేసవి కాలం వస్తుందంటే చాలు… నగరంలో చోరీల కాలం వచ్చినట్టే… అన్నట్టుగా ర్రాష్ట్ర, అంతరాష్ట్ర దొంగలు, దొంగల ముఠాలు నెల రోజుల ముందునుండే హైదరాబాద్ మహానగరంలో మకాం వేస్తారు. బతుకుతెరువు కోసం అన్నట్టుగా కనిపిస్తా రు. తెల్లవారుజాముల్లో తాళంవేసిన, ఎవ్వరూలేని ఇళ్ల లో చోరీలకు పాల్పడుతారు. గత కొన్నేళ్ళుగా ఈ రకమైన నేరాలు వేసవి కాలం ప్రారం భం నుండి మొదలవుతాయి. ప్రధానంగా న్యూజల్‌పాయిగురి, శివాజీనగర్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాళ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లకు చెందిన ముఠాలు, పే రుమోసి న దొంగలు నగరాన్ని లక్షంగా చేసుకుని తమత మ కుటుంబాలతో, సహచరులతో కలిసి వేసవికాలానికి ముందుగానే చేరుకుంటారు. పెద్దమొత్తం లో సొత్తు, నగదు దొరికిన వెం టనే మరో రాష్ట్రాని కి బయలుదేరి వెళ్ళిపోతారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే అధిక శాతం రైళ్ళలో, తక్కువ శాతం మంది బస్సుల్లో నగరానికి చేరుకుంటారు. తాముల క్షం చేసుకున్న ప్రాంతాలకు చేరువగా బసచేసి పరిస్థితులను, పరిసరాలను గమనిస్తూ అవకాశాన్ని పసిగడుతుంటారు.
బస ఇక్కడే…

ప్రధానంగా కొత్తగా ఇళ్ళ నిర్మాణం జరిగే ప్రాం తాలు, కొత్తకాలనీలు, మురికివాడలు, బస్సుస్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లు, సాధారణ హోటళ్ళు ప్రాంతాల్లో వీరు చేరుకుంటారు. ఈ ప్రాంతాల్లో చేరడం వల్ల అందరూ కొత్తగానే ఉం టారు. ఎవరెవరినీ పెద్దగా పట్టించుకోరు. కొందరు హోటళ్ళ లో పనిచేసేవారిగా చేరుతారు. రాత్రి వేళల్లో సినిమాలు చూడటం తెల్లవారుజాములో తాము నిర్దేశించుకున్న ప్రాంతానికి చేరుకు ని ఇళ్ళల్లో చోరీలు చేయడం వీరికి వెన్నతోపెట్టిన విద్య. వీరు ప గటిపూట ముగ్గురు నలుగురుగా ఏర్పడి పనికోసం వెతుకుతున్నట్టుగా తిరుగుతూ తాళం వేసిన ఇళ్ళను గమనిస్తుంటా రు. వీరు అధిక శాతం లుంగీలు, బనియన్‌లు ధరించి పేదవారిగా కనిపిస్తుంటారు. వరుసగా రెండు రోజు లు తాళం వేసినా, రాత్రివేళలో గేటుకు తాళంవేసిన ఇళ్ళు కనిపిస్తే చా లు సెకండ్‌షో సినిమా విడిచిన అనంతరం జనాలు ఎక్కడికక్కడకు వెళ్ళిపోయారని గమనించి ఇళ్ళలోకి చొరబడుతా రు. మహిళలు కూడా తెల్లవారుజాము న కిటికీలు తెరిచిన ఇళ్లలోని దుస్తులను మాయం చేస్తుంటారు.
చోరీలు ఇలా…

ప్రహారీలపై నుండి ఇళ్ళ ఆవరణలోకి చేరుకుని వెనుకవైపుగా ఉన్న కిటికీలను, తలుపులను తొలగించి చొరబడుతారు. ఆ ఇంటి నుండి మరో ఇంటికి ఇలా వరుసగా దొంగతనం చేయడానికి అనుకూలంగా ఇళ్ళలోనికి చేరుకుని భారీ గా సొత్తు దొరకగానే నేరుగా తమ స్థావరాలకు చేరుకుని కుటుంబాలతో సహా ఉడాయిస్తారు. వీరు అధికంగా నగలు, నగదుపైనే దృష్టిసారిస్తారు. వీరు హత్యలు, హత్యాయత్నాలు చేయడానికి అధికశాతం మంది దూరంగా ఉంటారు.
ప్రత్యేక నిఘాతో పోలీసులు…

ప్రతిఏటా ఫిబ్రవరి మాసం ముగిసిన అనంతరం హైదరాబాద్ మహానగరం పరిధిలోని పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదిలికలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జ రుగుతుంది. బస్‌స్టేషన్‌ల్లో ఒక రోజుకుమించి బసచేసేవారిపై, సంపన్నులుండే కాలనీల్లో కొత్తగా ముగ్గురు నలుగురు కలిసి తిరిగే వారిపై, సాధారణ హోటళ్ళలో నూతనంగా పని కి చేరినవారిపై, కొత్తగా నిర్మాణం జరుగుతున్న బహుళ అం తస్థుల భవనాల్లో వాచ్‌మెన్‌లుగా నివాసముండే వారిపైనా నిఘాను ఏర్పాటు చేస్తారు. అర్థరాత్రి దాటిన తర్వాత వీధు ల్లో సంచరించేవారి కదలికలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టిసారించినట్టు సమాచారం. వేసవిలో చోరీల ని వారణపైనే పోలీసులు నిఘాను మరింత పటిష్టంచేస్తున్నట్టు తెలిసింది.