Friday, March 29, 2024

జగపతిబాబు సోదరుడికి బెదిరింపు కాల్స్

- Advertisement -
- Advertisement -
Threat calls to Actor jagapathi babu brother
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

హైదరాబాద్: సినీ నటుడు జగపతిబాబు సోదరుడు ఫిలింనగర్‌లో నివసించే యుగేంధ్ర కుమార్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుట్టల బేగంపేట స్థల విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి దాదాపు 25 ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. కాగా ఫోన్‌లో యుగేంధ్ర కుమార్‌తోపాటు అతని కుమారుడిని కూడా చంపేస్తామని బెదిరించారని, ఈ బెదిరింపు కాల్స్ వెనుక బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజిరెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ఆయన బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులుదర్యాప్తు చేపట్టారు.

Threat calls to Actor jagapathi babu brother

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News