Home ఎడిటోరియల్ ప్రజారోగ్యానికి పెనుముప్పు

ప్రజారోగ్యానికి పెనుముప్పు

ప్రపంచ దేశాలన్నింటిలో వైద్యం అధ్వాన్నంగా ఉన్న దేశాల జాబితాలో భారతదేశం 154 వ స్థానంలో ఎంత వెనుకబడిందో తేటతెల్లమవుతోంది. దేశవ్యాప్తంగా వైద్యం పూర్తిగా నిర్వీర్యమై 80 శాతం ప్రైవేటు అధీనంలోకి వెళ్లింది. 2020 నాటికి అందరికీ వైద్యం అనే నినాదం గత 20 సంవత్సరాలుగా నినాదం గానే మిగిలింది. అందరికీ అందించాలంటే వైద్యం ప్రైవేటీకరణ నుంచి ప్రభుత్వ అధీనంలోకి మళ్లీ రావాల్సిందే. దేశవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాలు సవాలక్ష సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సుమారు 35వేల వైద్య ఉద్యోగాలు భర్తీ కాకుండా ఖాళీగానే ఉన్నాయి. పదివేల ఆరోగ్య కేంద్రాలలో 4900కేంద్రాలలో ప్రసూతి వైద్యు లు లేరు. 2011 అధ్యయనంలో చేదు నిజాలు వెలుగుచూశాయి. జార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌ఘర్, మణిపూర్, ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో వైద్య ఆరోగ్య కేంద్రాలలో మాతా శిశు సంరక్షణ అందించడానికి కనీస సదుపాయాలు లేవని, రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పదుల సంఖ్యలో చనిపోతున్నారని రోగుల బంధువులు వైద్యులపై దాడి చేస్తున్నారు. లక్షన్నర ఆరోగ్య కేంద్రాలను ఆరోగ్య సంక్షేమ కేంద్రాలుగా చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.2017 బడ్జెట్ లో ఏడు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. కేంద్రం కోసం 44,500 కోట్ల రూపాయలు, రాష్ట్రాలు 88వేల 215 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.
అయినా మార్పులు రావడం లేదు. పాలకులు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం ప్రైవేటు ఆసుపత్రులు పెరిగిపోయాయి. ప్రజలు వాటినే ఆశ్రయిస్తున్నారు. మానవుడు శారీరకంగా ఆరోగ్యవంతంగా వుండాలంటే పౌష్టికాహారం, స్వచ్ఛమైన గాలి, నీరు ఉండాలి. కానీ కాలుష్యం సమస్యలు పెరిగిపోయాయి. కాలుష్యం బారిన పడి ఏటా 25లక్షలమంది శ్వాసకోశ వ్యాధులతో చనిపోతున్నారు. ప్రపంచ దేశాల్లో క్యాన్సర్ వ్యాధి మరణాల్లో భారతదేశం మూడో స్థానంలో ఉంది. అలాగే మలేరియా మరణాల్లో 4వ స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయినా పాలకులు పట్టించుకోవడం లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోరకపూర్ ఘటన ప్రపంచాన్ని కలిచివేసింది. వెంటిలేటర్లు లేక ఆక్సిజన్ అందక వందలమంది చిన్నారులు చనిపోయారు. దేశంలోని ప్రభుత్వ దవాఖానాల్లో సరైన వైద్య పరికరాలు, సరిపడా సిబ్బంది లేని కారణంగా రోగులు చనిపోతున్నారు. 2015లో మొత్తంగా 59 లక్షలమంది చనిపోయారు. ఇందులో 26లక్షల మంది భారత్‌కు చెందినవారు. కాంగో, పాకిస్థాన్, నైజీరియాకు చెందిన వారు ఉన్నారు. భారతదేశం జిడిపిలో 3% ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నది. అమెరికాలో 18%, ఇంగ్లాండ్, ఫ్రాన్స్లో 16% ఖర్చు చేస్తున్నాయి. ఈ విధంగా చూస్తే ప్రతి దేశం వైద్యానికి చేసే ఖర్చు తక్కువగా ఉంది. మన దేశ పాలకులు పొరుగు దేశాల నుంచి నేర్చుకోవాల్సి ఉంది. ఆరోగ్యానికి నిధులను ఇప్పటికయినా పెంచాల్సింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ వంటి దేశాలలో ప్రజాఆరోగ్యం ప్రభుత్వ అధీనంలో ఉన్నా యి. మందుల ధరలు నిర్ణయించటంలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దవాఖానాలు, వైద్యులు వసూలు చేసే చార్జీలపై ప్రభుత్వమే పర్యవేక్షిస్తాయి. నిబంధనల ప్రకారమే దవాఖానాలు నెలకొల్పాలి. అవసరాల నిమిత్తం ఆస్పత్రులకు లైసెన్సు ఇస్తారు.
రాష్ట్రాలవారీగా వ్యత్యాసాలు పరిశీలించుదాం:
కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం ఫార్మసీలకు 29%, ప్రైవేటు ఆసుపత్రులకు 26%, ప్రైవేట్ క్లినిక్‌లకు 5%, డయాగ్నస్టిక్స్ ల్యాబులూ, రోగుల వ్యక్తిగత ఖర్చులు5% ఖర్చవుతున్నాయి. ప్రజలు తమ సంపాదనతో పాటు రుణాలు తెచ్చుకొని ఆస్పత్రులకు ఖర్చు చేస్తున్నారు. 68% రుణ మొత్తంలో 25% వైద్య ఖర్చులకే ఖర్చవుతోంది. గ్రామాలు 86% నగరాలలో 82% వైద్య ఆరోగ్య పథకాలు నోచుకోవడం లేదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఖర్చులు మూలంగా ప్రజల జీవన స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వైద్య బీమా ప్రైవేట్ ఏజెన్సీలు పరిమితంగా అమలు చేయడం వల్ల వైద్యం అందని ద్రాక్ష పళ్ళలా మారింది. కార్మికులకు ఇఎస్‌ఐ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకం ఉన్నా దారిద్య్ర రేఖ దిగువనున్న కుటుంబాల సైతం ప్రైవేటు వైద్యమే దిక్కవుతోంది. దీనిని ఆసరా చేసుకొని యాజమాన్యాలు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు డబ్బే ప్రధానంగా ఎంచుకొని రోగులపై దాష్టీకాలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. నిత్యం వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా వైద్యానికి పడినటువంటి ఖర్చులు అంతంత మాత్రమే. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినట్లు తేటతెల్లమవుతోంది
నాటువైద్యం మూలంగా ఆదివాసులు, గిరిజనులు నివసించే ప్రాంతాలలో ప్రతియేటా వందలమంది చనిపోతున్నారు. నాటువైద్యం పైన ఆధారపడి జీవిస్తున్నారు. రక్షిత నీటి పథకాలు కొరవడిన కారణంగా పట్టణాలు, నగరాలలో వేలకువేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. గాంధీ, ఉస్మానియా తదితర ప్రభుత్వ వైద్యశాలలన్నీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఐడిపిఎల్ ఉన్నప్పుడు మందులు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండేవి. నేడు ప్రైవేటు ఔషధాలయాలు వారు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు.
జనాభా పెరుగుతున్న కొలది ఆసుపత్రులు పెరగాలి. తెలంగాణ జిల్లాలో 10 జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. ఇంకా కొత్తవి రావాలి. 200 ఆసుపత్రులు, 670 ప్రాథమిక వైద్యాలయాలు రాష్ట్రంలో ప్రైమెరీ హెల్త్ సెంటర్లు 54 నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవాలకు నోచుకోలేకపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రైమరీ హెల్త్‌సెంటర్లు 675, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు నాలుగువేలకు పైగా ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య విధాన పరిషత్‌లో వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ఆరోగ్య శాఖలో 25వేల కోట్లు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేయకుండా కాలయాపన జరుగుతోంది. రెగ్యులర్ ఉద్యోగులను నియమించకుండా కాంట్రాక్టు ఉద్యోగులుగా 50% నియమించారు. పే రివిజన్ కమిటీ ప్రకారంగా వేతనాలు పెరగాలి కానీ, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెరగడం లేదు. పదివేలమంది కాంట్రాక్టులోనే కొనసాగుతున్నారు. ఎన్నో ఏళ్లుగా వైద్య సేవలందిస్తున్న ఎఎన్‌ఎంల వేతనం పదివేల రూపాయల లోపు ఉంది. 2008 ప్రకారం తొమ్మిదవ వేతన సవరణ ప్రకారం జీతాలు పెరగాలి. కానీ ఇంతవరకు జీతాలు పెంచకుండా వారిచేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేక చాలామంది వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలా వెట్టిచాకిరీలోనే వారు మగ్గిపోతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తనిఖీల్లో భయంకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. ప్రైవేటు మెడికల్ కళాశాలలో కౌన్సిల్ తనిఖీల్లో అనేక చీకటి కోణాలు ఉన్నాయని కనుగొన్నారు. జూనియర్ డాక్టర్లు అప్పుడప్పుడు మెరుపు సమ్మె చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రొఫెసర్లు, డాక్టర్లను నియమించాలని, ప్రొఫెసర్ల స్టైఫండ్ పెంచాలని, టీచింగ్ కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రులను ఉంచాలని వైద్యశాఖలో ఖాళీలు భర్తీ చేయాలని తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. కేరళ రాష్ట్రంలో వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉంది. ప్రజారోగ్యం ప్రజలకు అందించడం ప్రాథమిక హక్కు. ఈ హక్కులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల రాస్తున్నాయి. ప్రైవేటీకరణ వల్ల వైద్యం అంగడి సరుకుగా మారిం ది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యాన్ని కాపాడేలా చూడాలి. వైద్యరంగంలో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలి.
మానవుడి ప్రాణాలు హరించే అణు విద్యుత్ కేంద్రాలు
అడవికి కేంద్రాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా యి. భారతదేశంలో నాలుగు రాష్ట్రాల్లో అణు విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించి 700 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నట్లు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న సాంకేతిక విజ్ఞానంతో నిర్మించిన రెండు అణువిద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే తమిళనాడులోని కుడంకుళం లో ఏర్పాటుచేసిన అణు విద్యుత్ కేంద్రంతో అక్కడి ప్రజలు పెద్దఎత్తున పోరాడుతున్నారు. ఈ కేంద్రాల వల్ల పర్యావరణం దెబ్బతిని కాలుష్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అణు విద్యుత్తుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఐదవ దశకంలో ముంబయికి సమీపంలో తారాపూర్‌లో అణుఇంధన కేంద్రాన్ని కేంద్రా న్ని ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు కూడా ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. రష్యాలోని చెర్నోబిల్, జపాన్‌లోని పుకిషిమాలో అమెరికా త్రీ మైల్ ద్వీపంలో జరిగిన ప్రమాదాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. పర్యావరణం పూర్తిగా దెబ్బతింది. అణు కేంద్రాల నుంచి వెలువడే రేడియోధార్మిక తరంగాలు చుట్టుపక్కల ఉండే వారిపై తీవ్రప్రభావం చూపుతుంది. అణు విద్యుత్ కేంద్రాలు మానవాళి ఉనికి లేకుండా చేస్తాయి. పర్యావరణం, కాలుష్య సమస్యలు తలెత్తుతాయి. పర్యావరణం క్షేమ దాయకంగా ఉండాలంటే సౌర అపారమైన పవన శక్తి, జీవ ఇంధనాలు వినియోగించే వైపు పాలకులు దృష్టిసారించాలి.