Saturday, April 20, 2024

సిద్ధూతో దేశ భద్రతకు ముప్పు

- Advertisement -
- Advertisement -

Threat to national security with Sidhu: amarinder singh

చండీగఢ్: పంజాబ్ పిసిసి చీఫ్, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై కెప్టెన్ అమరిందర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్ధూతో మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఆయనను ముఖ్యమంత్రిగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లనని, తరచూ వెళ్లే వారు పార్టీ హైకమిండ్‌తో ఏం చెబుతున్నారో తనకు తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి కావాలనుకుని తనకు వ్యతిరేకంగా మొత్తం వాతావరణాన్ని మార్చేశాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమరిందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూను ముఖ్యమంత్రి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. పాకిస్థాన్‌తో ఆయనకు ఎలాంటి సంబంధాలున్నాయో నాకు తెలుసు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ఆయనకు స్నేహితులు. ఆయనను ముఖ్యమంత్రి చేస్తే దేశ భద్రతకు ముప్పు వాటిల్లడం ఖాయం. సిద్ధూ ముఖ్యమంత్రి పదవికి సమర్థుడు కాడు’ అని కెప్టెన్ అన్నారు. సిద్ధూ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడం కోసమే ఆయనను టార్గెట్‌గా చేసుకుని అమరిందర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తున్నదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News