Home తాజా వార్తలు ‘చిగురుపాటి’ కేసులో పిపికి బెదిరింపులు

‘చిగురుపాటి’ కేసులో పిపికి బెదిరింపులు

Threats to PP in Chigurupati Jayaram case:3 arrested

ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో సాక్షులతో పాటు ప్రభుత్వ పిపిని బెదిరించిన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. ఎన్‌ఆర్‌ఐ చిగురుపాటి జయరామ్‌ని రెండేళ్ల క్రితం హతమార్చిన రాకేశ్‌రెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఖైదీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో జయరామ్ హత్య కేసులో సాక్షులను, గవర్నమెంట్ పిపిని బెదిరించేందుకు తన అనుచరులైన అక్బర్ అలీ, మంగయ్య గుప్త, శ్రీనివాస్‌లను రంగంలోకి దింపాడు. ఈక్రమంలో పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో విషయంలో తమకు అనుకూలంగా ఉండాలని అక్బర్ అలీ, మంగయ్య గుప్త, కత్తుల శ్రీనివాస్ పబ్లిక్ ప్రాసిక్యూకర్‌ని బెదిరించారు. ఈ వ్యవహారం మొత్తం రాకేశ్‌రెడ్డి జైలు నుంచి నడిపారని పోలీసులు భావిస్తున్నారు. పిపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్ రెడ్డి అనుచరులైన అక్బర్ అలీ, మంగయ్య గుప్త, శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.