Friday, April 19, 2024

సమత కుటుంబానికి మూడెకరాల భూమి

- Advertisement -
- Advertisement -

Samata family

 

ఆసిఫాబాద్: ఆసిఫాబాదు జిల్లా ఎల్లపటార్‌ ఆటవీ ప్రాంతంలో సమతపై అత్యాచారం, హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.  సమత కుటుంబానికి ఎస్సీ కమిషన్‌ సూచన మేరకు మూడు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. శనివారం నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని పాతయెల్లాపూర్‌ గ్రామ శివారులో సమత కుటుంబానికి ఇవ్వబోయే వ్యవసాయ భూమిని స్థానిక తహసీల్దార్‌ జే. నారాయణ రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. యెల్లాపూర్‌ శివారులోని సర్వే నెంబర్‌ 108లో ఈ భూమిని కేటాయించారు. ఈ భూమికి సంబంధించిన పత్రాలను సోమవారం  సమత కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని తహసీల్దార్‌ తెలిపారు.

Three acres of Land to Samata family
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News