Wednesday, April 24, 2024

ఉద్యోగాల పేరుతో.. ఘరానా మోసం

- Advertisement -
- Advertisement -

Three arrested for job fraud in wanaparthy

పెబ్బేరుః ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మహిళతోపాటు ఇద్దరు వ్యక్తులు నిరుద్యోగుల నుండి రూ. కోటి 60 లక్షలు వసూలు చేసినట్లు డిఎస్‌పి కిరణ్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్‌పి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల, పెబ్బేరు మండలాల పరిధిలోని 31 మంది యువకులను నమ్మించి రూ. కోటి 58 లక్షలు వసూలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. డిఎస్‌పి కిరణ్‌కుమార్, ఎస్‌ఐ వహీద్ అలీభేగ్,రాఘవేందర్‌రెడ్డిల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నంబావి మండలంలోని అమ్మాయిపల్లి గ్రామానికి చెందిన వసంత,వీపనగండ్ల ,కల్వరాలకు చెందిన ఆర్‌ఎంపి శాంతయ్య, వీపనగండ్లకు చెందిన డ్రైవర్ అశోక్‌రెడ్డిలు కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటు పలువురిని నమ్మించి మోసం చేశారు.

ఒక్కొ ఉద్యోగానికి రూ.3 లక్షల నుండి రూ. 6 లక్షల వరకు డబ్బులు వసులు చేశారు. వసంత తాను రైల్వే శాఖలో టిసి టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యువకులను నమ్మించి డబ్బులు వసులు చేసేది. ఈ క్రమంలో ఆర్‌ఎంపి శాంతయ్యతో 2014 లో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆయనతో చనునవుగా ఉంటూ పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు తనకు బాగా తెలుసని ఎస్‌ఐ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 12 లక్షలు వసులు చేసింది. కొన్ని రోజులు గడి చాక తన ఉద్యోగం ఏమైందని అడగగా ఎస్‌ఐ ఉద్యోగం కాదు సిఐగా పదోన్నతి వచ్చిందని చెప్పి నఖిలీ ఆర్డర్‌కాపిని అందజేసి పోలీస్ యూనిఫాం కూడా ఇచ్చింది. అప్పటికే తన బంధువులైన కొందరికి మరి కొన్ని ఉద్యోగాలు కావాలని వారి వద్ద డబ్బులు తెచ్చి ఇచ్చిన ఆయన ఆమె చెబుతున్న మాటలు నమ్మలేదు.

తాను మోసపోయానని గుర్తించిన ఆయన ఆమెతో కలసి పోయి మోసాలకు పాల్పడడం ప్రారంభించాడు. వీరు తరచుగా అశోక్‌రెడ్డి కారును తీసుకొని వెళ్లేవారు . వీరి మోసాల గురించి తెలిసిపోయిన అతను కూడా వీరితో మిలాఖత్ అయ్యాడు. వీరు మండలాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా మంటూ మోసాలకు పాల్పడడం ప్రారంభించారు. ఈ క్రమంలో రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ , వివిధ రకాల ఉద్యోగాలు ఇప్పిస్తామని రాజేష్ నుండి రూ. 6 లక్షలు, అనిల్ నుండి రూ.4 లక్షలు, శ్రీనివాసులు నుండి రూ. 2 లక్షలు, సుధాకర్ నుండి రూ. 2.50 లక్షలు వసూలు చేశారు. వీరందరికి నకిలీ ఆర్డర్‌కాపీలను అందించి రెండు నెలల పాటు నెలకు రూ. 14వేల జీతాన్ని కూడా ఇచ్చారు. జీతం సరే కాని మా ఉద్యోగాలు ఏమయ్యాయి. అని నిలదీయగా ఆ మహిళ కనిపించకుండా పోయింది.

దీంతో బాధితులు వీపనగండ్ల, పెబ్బేరు పోలీస్ స్టేషన్స్‌లో ఎస్‌ఐలు వహీద్‌అలీభేగ్, రాఘవేందర్‌రెడ్డిలకు ఫిర్యాదు చేశారు. కేసులు నమో దు చేసిన ఎస్‌ఐలు, పోలీసులు కూపీలాగగా డొంకంతా కదిలింది. వసంత,ఆర్‌ఎంపి శాంతయ్య, డ్రైవర్ అశోక్‌రెడ్డిల భాగోతం వెలుగులోకి వచ్చింది. అశోక్‌రెడ్డి మండలాల్లో కూడా కొంత మంది నిరుద్యోగ యువ కులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తు న్నారు. ఈ వ్యవహారంలో పెబ్బేరు మండలంలో 26 మంది యువకుల నుండి రూ. కోటి 30 లక్షలు, వీపన గండ్ల మండలంలో రూ. 26.5 లక్షలు వసులు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాపై 420,484, 417 చీటింగ్ కేసులు నమోదైనట్లు డిఎస్‌పి కిరణ్‌కుమార్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిఐ మల్లికార్జున్‌రెడ్డి ,ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వహీద్ అలీబేగలను డిఎస్‌పి అభినందించారు. ఈ సమావేశంలో పోలీసులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News