Home నిజామాబాద్ మూడురోజుల ముచ్చటేనా!

మూడురోజుల ముచ్చటేనా!

ration

*మొరాయిస్తున్న వేయింగ్ మిషన్లు
*ఇబ్బంది పడుతున్న సామాన్యులు

రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల పంపిణీలో అవినీతి జరగకుండా ఉండేందుకు గత కొద్దిరోజుల క్రితం ప్రతి రేషన్‌షాప్‌కు సరఫరా చేసిన తూకపు యంత్రాలు (వేయింగ్‌మిషన్)ను సరఫరా చేసింది. కాని అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు పంపిణీ చేసిన మూడు రోజులకే అవి అటు రేషన్ డీలర్లను, ఇటు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కంట్రోల్‌లో ఉండాల్సిన తూకం కంటాలు, మిషన్‌లు కంట్రోల్ తప్పి ఇష్టం వచ్చినట్లు పనిచేస్తుండడంతో సామాన్యులు నిత్యావసర వస్తువులు తీసుకోవడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువులు లేనిదే పూట గడవని సామాన్య ప్రజలు రేషన్ తీసుకోవడంలో పరేషాన్ అవుతున్నారు. మనతెలంగాణ/ముప్కాల్ : రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల పంపిణీలో అవినీతి జరకుండా ఉండేందుకు గత కొద్ది రోజుల క్రితం ప్రతి రేషన్ షాప్‌కు సరఫరా చేసిన తూకపు యంత్రాలు (వేయింగ్‌మిషన్)ను సరఫరా చేసింది. కానీ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు పంపిణీ చేసిన మూడు రోజులకే అవి అటు రేషన్ డీలర్లను, ఇటు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. కంట్రోల్‌లో ఉండాల్సిన తూకం కం టాలు, మిషన్‌లు కంట్రోల్ తప్పి ఇష్టం వచ్చినట్లు పనిచేస్తుండడంతో సామాన్యులు నిత్యావసర వస్తువులు తీసుకోవడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువులు లేనిదే పూట గడవని సామాన్య జనం రేషన్ తీసుకోవడంలో పరేషాన్ అవుతున్నారు.
* తూకం పరికరాలు పని చేయడం లేదు:
రేషన్ తీసుకునేందుకు ఉపయోగించే నూతన తూక పరికరాలు, మిషన్‌లు సరిగ్గా పనిచేయడం లేదు. రేషన్ తీసుకోవడంలో అవతవకలు, ఇకపై ఉండవంటూ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చిన ప్రభుత్వం వాటిని తీసుకోవడానికి బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానానికి అడ్డుకట్ట పడింది. వేయింగ్ మిషన్లు ప్రారంభించి వారం రోజులైనా కాకముందే అవి మొరాయించడం మొదలుపెట్టాయి. కొన్ని గ్రామాల్లో అయితే మిషన్‌లు ప్రారంభించిన నాటి నుండే సరిగ్గా వినియోగదారునికి రావాల్సిన బరువు సమానంగా వచ్చినట్లు చూపితే బయట షాపుల్లో 2 కేజిలు తక్కువగా చూపిస్తుంది. మరికొన్ని చోట్ల సిస్టం ఇంటర్‌నెట్ కనక్షన్ సరిగా రావడంలేదు. నెట్ సరిగ్గా ఉన్న మిషన్‌లు ఆగిపోవడం లాంటివి జరుగుతు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రేషన్ డీలర్లు వాపోతున్నారు. సరుకులు కావాలంటే వేలి ము ద్రలు మాత్రం వేస్తే సరిపోయేదానికి వేలిముద్రలకు ఒక మిషన్, తూ కానికి మరో మిషన్, మళ్లీ అవి డైరెక్ట్ నెట్ కనెక్షన్లతో ఒకే చేయడం అంటు నానా హైరానా చేయడంతో రేషన్ పంచడంలో ఎక్కువ సమ యం పడుతుందని చివరి సమయంలో మిషన్ మోరాయిస్తే మళ్లీ మొదటికి రావడం జరుగుతుందని వారు అంటున్నారు. రేషన్ దుకాణాల్లో ఒక యంత్రం పనిచేస్తే ఇంకోటి మొరాయించడంతో వారిని సరి చేసేందుకే కాలం వృథా అవుతుందని సరుకులను పంచడం తలకుమించిన భారం అవుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ మోరాయింపుల బాధ నుండి డీలర్లకు ఉపశమనం కలిగించి ప్రజలకు సరుకుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. అయినా ఈ విధానం వల్ల అవినీతి పారద్రోలాడమేమో కానీ రేషన్‌షాపుల నుండి జనాలను సరుకులు తీసుకోవడానికి జంకుతున్నారు. వేలిముద్రలు పెడితే కానీ రేషన్ సరుకులు తీసుకోవడం కుదారదని ప్రభుత్వం ఖచ్చితంగా ఉత్తర్వులు జారీ చేయడంలో ఇకపై రేషన్ సరుకులు పక్కదారి పట్టవని, సక్రమమైన మార్గంలో అర్హులకు మాత్రమే అందుతాయని అంతా అనుకునే లోపే సీను రివర్స్ అయింది. అనర్హులకు అందడమేమో కానీ అర్హులకు కూడా అందకుండా పోయేలా ఉ న్నాయని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎందుకంటే కొంద మంది వృద్ధ్దులకు వేలిముద్రలు రాకపోవడంతో సరుకులు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. మిషన్‌లు పనిచేయకపోతే పట్టించుకుని బాగు చేయాలంటే రెండు, మూడు రోజులవుతుందంటున్నారు. రిపేర్ చేసే వాళ్ళల్లో ఒకరు డెస్క్ రిపేర్ చేయడానికి, మరొకరు నాల్కెన్ కంపెని నుండి యంత్రాన్ని రిపేర్ చేయడానికి 9మండలాలకు ఇంచార్జీలుగా ప్రభుత్వం నియమించిందని ఎవరి బాధ్యత వారే చూస్తారని మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవాలందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపడుతున్న పథకాలు సులభతరంగా ఉండాలే తప్ప, ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని కొందరు ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వీటిలో ఉన్న లోటుపాట్లను త్వరగా సరిచేసి రేషన్ సరుకుల పం పిణీలో ఏర్పడుతున్న జాప్యాన్ని తగ్గించి, పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.
* సమయానికి సరుకులు ఇవ్వడం లేదు ,అబ్దుల్ నబ్బి) : రేషన్ సరుకులు ప్రతి నెల 1వ తేదీన వచ్చేవి. కానీ ఈ మిషన్‌ల కారణంగా ఇన్ని రోజుల ఆలస్యంగా వచ్చాయి. వచ్చాక మిషన్‌లు సరిగా పనిచేయకపోవడంతో మరింత వృథా అవుతూ, సరుకులు ఎప్పటి వరకు ఇస్తారు అనే విషయం తెలియడం లేదు.
* పొద్దున్న పోతే సాయంత్రం అవుతుంది, సాయికుమార్:
సరుకులు తీసుకోవడం కొరకు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు అక్కడే వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి సంఘటనలు మహిళలకు, రోజువారి కూలీలకు ఇబ్బందిగా మారింది.