Saturday, April 20, 2024

తమిళనాడులో కల్తీ మద్యంకు ముగ్గురు బలి

- Advertisement -
- Advertisement -

విల్లిపురం (తమిళనాడు): విల్లిపురం జిల్లా ఎక్కియార్‌కుప్పం వద్ద మరక్కణంలో శనివారం రాత్రి కల్తీమద్యం తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు 45 నుంచి 55 ఏళ్ల వారు. శనివారం రాత్రి కల్తీమద్యంతో అస్వస్థులైన వీరు ప్రాణాలు కోల్పోయారని పోలీస్‌లు చెప్పారు. వీరు కాక మరో ఇద్దరు మద్యం తాగడంతో అస్వస్థులు కాగా, వీరిని పొరుగునున్న పాండిచ్చేరిలో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు పోలీస్‌లను సస్పెండ్ చేసినట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు..మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం అమ్మిన నేరంపై ఒకరిని అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి తెలిపారు.

మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. కల్తీమద్యం ,డ్రగ్స్‌ను కూకటివేళ్లతో నిర్మించాలని తమ ప్రభుత్వం నిర్ణయించగా, ప్రభుత్వ లక్షాన్ని నిర్లక్షం చేసినందుకు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లతోసహా మొత్తం నలుగురు పోలీస్‌లను సస్పెండ్ చేశామని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలియజేశారు. వైద్యచికిత్స పొందుతున్న ఇద్దరికి రూ.50 వేలు వంతున సాయం ప్రకటించారు. విపక్షాలు ఎఐఎడిఎంకె, పిఎంకె పార్టీలు ఈ సంఘటనపై అధికార పార్టీ డిఎంకెపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. తమ ప్రభుత్వ పాలన పదేళ్లలో అక్రమ మద్యానికి చోటు లేకుండా చేశామని ఎఐడిఎంకె ప్రధాన కార్యదర్శి కె. పళనిస్వామి పేర్కొన్నారు. ఇప్పటి ప్రభుత్వ అసమర్థత వల్ల ఈ మరణాలు సంభవించాయని విమర్శించారు. ఇప్పటికైనా కల్తీ మద్యం విక్రయం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

కల్తీ మద్యం విక్రయంపై ఏమాత్రం చర్యలు తీసుకోకుండా వ్యవహరించిన బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిఎంకె సంస్థాపకులు డాక్టర్ ఎస్. రామదాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిషేధం విధించి మద్యం అమ్మకాలను నివారించాలని డిమాండ్ చేశారు. ఈలోగా మరక్కణం నివాసులు ఈస్ట్‌కోస్ట్ రోడ్డును దిగ్బంధం చేస్తూ ధర్నా నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News