Home ఆంధ్రప్రదేశ్ వార్తలు వినాయక నిమజ్జనంలో విషాదం…

వినాయక నిమజ్జనంలో విషాదం…

Diedఅమరావతి: కృష్ణా జిల్లా ఎ.కొండూరు వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేస్తుండగా నీట మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి స్థానిక చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేస్తుండగా.. ముగ్గురు యువకుడు గల్లంతయ్యారు. తక్షణమే గాలింపు చర్యలు  చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు యువకుల మృతదేహాలను వెలికితీశారు. మృతులను గోపాలరావు, భూక్యా నాయక్, చంటి గా గుర్తించారు. ముగ్గురు యువకులు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈత రాకపోవడంతోనే వారు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు.
Three died in vinayaka immersion At krishna district