Home ఆదిలాబాద్ ముగ్గురు రైతులు ఆత్మహత్య

ముగ్గురు రైతులు ఆత్మహత్య

వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు

                  Farmers-Suicide

వికారాబాద్/రామాయంపేట/బజార్‌హత్నూర్ : వికారాబాద్ రూరల్ : అప్పుల బాధ భరించలేక మరో యువ రైతు బలవన్మరణం పొందిన సంఘటన బూరుగుపల్లిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన గం గారం నర్సింహులు(28) వ్యవసాయం కోసం వడ్డీ వ్యాపారుల వద్ద రూ. 3.50లక్షల అప్పు తీసుకున్నాడు. దీంతో అప్పుల బాధలు భరించలేక గురువారం మధ్యా హ్నం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కాగా మెదక్ జిల్లా మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… అప్పుల బాధ తాళలేక ఓరైతు తన వ్యవసాయ పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన నిజాంపేట మండల తిప్పనగుల్లలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. నిజాంపేట ఎస్‌ఐ ఆంజనేయులు వివరాల ప్రకా రం గ్రామానికి చెందిన బొమ్మ బాలమల్లయ్య (45) కుటంబ అవసరాల కోసం, వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో తీవ్రమనస్థాపం చెందిన బాలమల్లయ్య బుధవారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం స్థానిక రైతులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అంజనేయులు తెలిపారు.

మరో ఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలోని భూతాయి(కే) గ్రామపంచాయతీ పరిధిలోని మాన్కపూర్ గ్రామానికి చెందిన యువరైతు బాంద్రే అమర్‌సింగ్(20) అప్పుల బాధతో బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా వ్యవసాయం కోసం చేసిన అప్పులే కారణమని కుటుంబీకులు చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. స్థానిక ఎస్‌ఐఆకుల శ్రీనాథ్ బాంద్రే అమర్‌సింగ్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.