Home తాజా వార్తలు కారు ఢీకొని ముగ్గురు మహిళా కార్మికులు మృతి

కారు ఢీకొని ముగ్గురు మహిళా కార్మికులు మృతి

Three female workers were killed in car crash

నందిగామ: రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలం చలివేంద్రగూడ వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డుప్రమాదం సంభవించింది. కారు ఢీకొని ముగ్గురు మహిళా కార్మికులు మృతిచెందారు. కారు టైరు పేలి అదుపుతప్పి రోడ్డు దాటుతున్న మహిళలను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను శంషాబాద్ మండలం మదనపల్లి తండా వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Three female workers were killed in car crash