Home ఆంధ్రప్రదేశ్ వార్తలు బాపట్లలో మూడు చేతులతో శిశువు జననం

బాపట్లలో మూడు చేతులతో శిశువు జననం

 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా బాపట్లలో మూడు చేతులున్న శిశువు జన్మించింది. శిశువుకు మూడు చేతులు ఉన్నాయని, చెవి, ముక్కు సరిగ్గా లేదని వైద్యులు వెల్లడించారు. పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బ్రతకడం కష్టమని వైద్యులు తెలిపారు. ఐదో నెలలో సదరు గర్భవతికి స్కానింగ్ చేసినప్పుడు మూడో చేతి కనిపించలేదని, ఎనిమిదో నెలలో స్కానింగ్ చేస్తే మూడో చేతి కనిపించిందని, అప్పుడు అబార్షన్ చేయడానికి వీల్లేదని ఆస్ప్రత్రి వర్గాలు వెల్లడించాయి. మేనరికం వివాహం వలన జన్యుపరమైన లోపాలతో పాప ఈ విధంగా జన్మించిందని వైద్యులు తెలియజేశారు. మూడు సంవత్సరాల క్రితం ఇదే దంపతులకు తొలి కాన్పులో కాళ్లు, చేతులు లేని శిశువు పుట్టి చనిపోయిందని వైద్యులు వివరించారు.

 

Three hands Baby Born in Bapatla in Guntoor Dist, Doctors revealed that the baby had three arms, No ear and a nose in Body, Baby health Condtion Critical