Friday, March 29, 2024

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Three injured in road accident at Kondapaka Village

కొండపాక: రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలైన సంఘటన కొండపాక మండల కేంద్ర పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్‌కు చెందిన పద్మ, మౌనిక, సాయిచరణ్‌లు వారి కుటుంబ సభ్యులతో కలిసి కారులో కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి దర్శనానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో రాజీవ్ రహదారి పై కొండపాక శివారులోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారును జెసిబి ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. వారిని కొండపాక 108 సిబ్బంది అనిల్, శ్రీనివాస్‌లు ప్రథమచికిత్స అందించి సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Three injured in road accident at Kondapaka Village

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News