Home తాజా వార్తలు చెరువులో మునిగి ముగ్గురు మృతి

చెరువులో మునిగి ముగ్గురు మృతి

Drowningసిద్దిపేట : కోహెడ మండలం వరికోల్‌ గ్రామంలో మంగళవారం ఉదయం పెను విషాదం నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానికంగా ఉన్న చెరువులో స్నానానికి వెళ్లిన ముగ్గురు బాలురు నీట మునిగి చనిపోయారు. మృతులను నిఖిల్‌, ప్రశాంత్‌, వరప్రసాద్‌గా గుర్తించారు. వీరి మృతితో వారివారి కుటుంబాలతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం కోసం నిఖిల్, ప్రశాంత్, వరప్రసాద్ ల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Three Killed in Drowning In Pond At Siddipet