Friday, March 29, 2024

వర్జీనియాలో విమానం కూలి ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

Three killed in plane crash in Virginia

 

లెన్సింగ్(యుఎస్): నైరుతి వర్జీనియానిలో ఆదివారం ఒక చిన్న విమానం కూలిపోయిన దుర్ఘటనలో విమానంలో ఉన్న ముగ్గురు వర్జీనియా పౌరులు మరణించారు. ఫయెట్టెవిల్లెలోని ఫాయెట్టె విమానాశ్రయం నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో బయల్దేరిన సింగిల్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ సి 23 విమానం కొద్ది నిమిషాలకే కూలిపోయినట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. చార్లెస్టన్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని గోర్జ్ నది వంతెనకు కొద్ది దూరంలోని లాన్సింగ్ సమీపంలో పొలాలలో విమాన శకలం లభించిందని అధికారులు చెప్పారు. విమానంలోపల మృతదేహాలు లభించాయని వారు తెలిపారు. ఈ సంఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు చేపట్టాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News