Wednesday, March 22, 2023

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

- Advertisement -

goatమనతెలంగాణ/చిట్యాల : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు గ్రామ శివారులో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున గొర్రెలతో వెళ్తున్న డిసిఎం వాహనం బొర్ల కొట్టిన సంఘటనలో ఇద్దరు గొర్రెల వ్యాపారులతో పాటు డిసిఎం వ్యాన్ క్లీనర్ మృతి చెందినట్లు చిట్యాల సిఐ పాండురంగారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నెక్కోండ మండలం గొల్లపల్లికి చెందిన ధోనికి కుమారస్వామి 40, సంగెం మండల క్రిష్ణా నగర్‌కు చెందిన మేకల మల్లయ్య 36, చెన్నారావు పేట మండలం వుప్పరపల్లికి చెందిన కొట్లారు రాకేష్ (22)లు బుధవారం నెక్కోండ సంతలో 105 గొర్రెలు కొనుగోలు చేశారు. అనంతరం హైదరాబాద్‌లో విక్రయించటానికి అదే రోజు రాత్రి గొర్రెలను తీసుకుని డిసిఎం వాహనంలో బయలుదేరారు. తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో వెల్మినేడు శివారులోకి వచ్చిన డిసిఎం వాహనం అదుపుతప్పి సైడ్ గోడను ఢీకొట్టి కల్వర్టులో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో వున్న ముగ్గురు మృతి చెందగా డ్రైవర్ ఉప్పరపల్లికి చెందిన మేడిపల్లి వెంకన్నకు తీవ్ర గాయాలు అయ్యాయి. 56 గొర్రెలు మృతి చెందాయి. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News