Home తాజా వార్తలు  నాగ‌ర్‌క‌ర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

 నాగ‌ర్‌క‌ర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

Three killed in road accident at Nagarkurnoolనాగ‌ర్‌క‌ర్నూల్ :  ప‌ద‌ర మండ‌ల ప‌రిధిలోని మ‌ద్దిమ‌డుగులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మ‌ద్దిమ‌డుగు స‌మీపంలో ఆర్టీసీ బ‌స్సు – ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఘటనాస్థలిలోనే ముగ్గురు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల‌ను మిర్యాల‌గూడ స‌మీపంలోని సూర్య‌తండా వాసులుగా గుర్తించినట్టు  పోలీసులు తెలిపారు. మ‌ద్దిమ‌డుగు ఆంజ‌నేయ‌స్వామి ద‌ర్శ‌నానికి వెళ్లి వస్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగిందని, ఆర్టీసీ బ‌స్సు దేవ‌ర‌కొండ డిపోకు చెందిన‌దని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.