Home ఖమ్మం అంత్యక్రియల కోసం.. మూడు కిలోమీటర్లు

అంత్యక్రియల కోసం.. మూడు కిలోమీటర్లు

funeralకూసుమంచి: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం, కూసుమంచి మండలంలోని గైగోళ్ళపల్లిలో శ్మశానవాటిక లేక అంత్యక్రియల కోసం మూడు కిలోమీటర్ల మేర మృతదేహాన్ని మోసుకువెళ్లి దహన సంస్కారాలు చేపడుతున్న తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దశాబ్దాలుగా ఈ గ్రామంలో నివసిస్తున్న అనేక మంది ప్రమాదవశాత్తూ చనిపోతే మూడు కిలో మీటర్ల మేర శవాన్ని మోకాళ్ళ లోతు నీళ్ళల్లో వరి పొలాలను దాటుకుని వెళ్లి దహన సంస్కారాలు చేయాల్సి వస్తుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి గైగోళ్ళపల్లి గ్రామంలో శ్మశానవాటికను ఏర్పాటు చేసి గ్రామస్థులను ఆదుకోవాలని కోరారు.

three kilometers for the funeral at khammam