Home Default మూడు లారీలు ఢీ… భారీగా ఆస్తి నష్టం

మూడు లారీలు ఢీ… భారీగా ఆస్తి నష్టం

 

మామడ: మూడు లారీలు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లారీ రవ్వ లోడుతో హైదరాబాద్‌కు వస్తున్నప్పుడు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆగిపోయింది. దాని వెనక ఉన్న మరో గోధుముల లారీ ముందున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఎడమ వైపున నిలిచింది. ఈ రెండు లారీలు ఢీకొన్నాయి గ్రహించిన మూడో లారీ డ్రైవర్ సడన్‌గా బ్రేక్‌లు వేసి ఎడమవైపునకు తిప్పడంతో లారీ పెద్ద గుంతలోకి దూసుకెళ్లింది. మూడో లారీ మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Three lorries collided in Mamada in Nirmal District