*పరారీలో మరో ఇద్దరు, ఒక రివాల్వార్ స్వాధీనం
మన తెలంగాణ/కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గంగారం గ్రామ సమీపంలో మావోయిస్టు కార్యకలాపాలు కొసాగించేందుకు ముగ్గురు అపరిచిత వ్యక్తులు సంచ రిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు స్థానిక ఎస్‌ఐలు బి.సతీష్, బాలకృష్ణలు పోలీసు సిబ్బం దితో అక్కడకు చేరుకోగా ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా తప్పించుకునేందుకు ప్రయత్ని ంచగా వారిని పట్టుకున్నారని, వారు మావోయిస్టు పార్టీ కొరియర్లుగా గుర్తించామని మహబూ బాబాద్ డిఎస్పీ ఎ.నరేశ్‌కుమార్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ మడగూడ గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హరిభూషణ్ ఆదేశాల మేరకు ముగ్గురు వ్యక్తులు వారి ఉనికిని చాటుకునేందుకు కార్యకలాపా లు కొనసాగిస్తున్నారన్నారు. అందులో భాగంగా గంగారం మండలం నర్సి గూడెం గ్రామానికి చెందిన ఈసం నాగేవ్వర్ రావు, గంగారానికి చెందిన పర్శిక వీరస్వామి, ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం పేరెపల్లికి చెందినవేమునూరి అశో క్‌లు ఆదివారం తెల్లవారు జామున గంగారం మండల కేంద్రంలో సంచరిస్తున్న ట్లు పోలీసులకు సమాచారం అందిందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసు లు అక్కడకు చేరుకోగా ఆ ముగ్గురు మావోయిస్టు కొరియర్లు తప్పించుకునేం దుకు ప్రయత్నించగా వారిని పట్టుకున్నామన్నారు. వారి దగ్గర ఫోర్‌టెన్( 4-10) రివాల్వార్‌తో పాటు తొమ్మిది రౌండ్లు దొరికాయన్నారు. పట్టుబడిన వారిని విచారించగా తాము మావోయిస్టు పార్టీ కొరియర్లుగా పనిచేస్తున్నమని, హరిభూ షన్ ఆదేశాలతో పందెం గ్రామానికి చెందిన జోగు రామయ్య వద్ద రూ.50లకు రివాల్వార్‌ను కొనుగోలు చేశామని వారు తెలిపారన్నారు. జోగు రామయ్యకు మధ్యవర్తిగా మడగూడ గ్రామానికి చెందిన మరో వ్యక్తి బీరబోయిన లింగ స్వామి, రివాల్వర్ అమ్మిన రామయ్యలు పరారయ్యారన్నారు. పరారీలో ఉన్న ఆ ఇద్దరినీ త్వరలోనే పట్టుకుట్టామని అన్నారు. పట్టుబడిన మావోయిస్టు కొరి య ర్లపై ఆయుద చట్టం క్రింద కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో జోగు రామయ్య ఎండీ పార్టీలో పనిచేశాడని, ఈసం నాగేశ్వర్ రావుపై పలు విప్లవ గ్రూపులతో సంబందాలు ఉన్నాయని, అతనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు ఉన్నాయన్నారు. విప్లవ పార్టీలు, సిద్ధాంతాల పేరుతో అమా యక ప్రజల్ని మోసం చేస్తూ వారి ప్రాణాలకు ముప్పుతెస్తే సహించేది లేదన్నారు. చట్టవ్యతిరేఖ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఆయుధాలు కలిగిన వారిపై శాఖ పరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.గ్రామాల్లోకి రాత్రి వేళలలో వచ్చే అపరిత వక్తులు, నక్సల్స్ మాటలు నమ్మ వద్దని, వారి ప్రలో భవాలకు తలొగ్గి వారికి సహకరిస్తే ఎంతటి వారినైన ఉపేక్షించేది లేదన్నారు. వారిపై క్రమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఉద్యమం పేరుతో వనజీవనం సాగిస్తున్న వారు జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి ప్రభుత్వం పునారావాసం కల్పిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో గూడూరు సిఐ రమేశ్ నాయక్, ఎస్‌ఐలు బి సతీష్, బాలకృష్ణ, బాబురావు, రవి, యాక య్యలతో పాటు పలువరు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.