Home తాజా వార్తలు ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

Three maoists surrendered in badradri kothagudem

 

భద్రాద్రి కొత్తగూడెం: ముగ్గురు మావోయిస్టులు స్దానిక పోలీస్ సేష్టన్లో లొంగిపోయిన సంఘటన జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్. జి తెలిపిన వివరాలు ప్రకారం ములకనపల్లి గ్రామానికి మడకం మారయ్య (60) మావోయిస్ట్ పార్టీకి సానుభూతిపరుడిగా ఉంటూ మావోయిస్ట్ పార్టీ వారికి రహస్యంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాడు. గతంలో నుంచి గ్రామస్థుల నుంచి బలవంతంగా వసూలు చేసి నగదు, నిత్యావసరాలను పంపించేవాడు. ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో సరుకులు, నగదు వసూల్ చేయలసిందిగా ఒత్తిడి చేయడం, దళంలో ఆడవారిని, చిన్న వయస్సు పిల్లలను, తన కూతురిని పీడిస్తూ వారిని హింసించడం, ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ నిర్వహిస్తున్న పద్దతులు నచ్చక బుధవారం పోలీస్ సేష్టన్ ముందర లొంగిపోయాడు.

అలాగే గత 18 నెలలుగా మడకం పాండు (20), మడకం చుక్కమ్మ (19)లు మావోయిస్ట్ పార్టీలో మిలీషియా సభ్యులుగా ఉంటూ వారు పెట్టే బాధలు పడలేక, వాళ్ళు చెప్పే పనులు చేయలేక వీరు ఇరువురు కూడా గ్రామానికి వచ్చి గ్రామ పెద్ద మడకం మారయ్యని కలిసి పోలీస్ సేష్టన్‌కు వచ్చి లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుందని, మావోయిస్ట్ పార్టీ నాయకులు, సభ్యులు, మిలీసియా సభ్యులు అందరు లొంగిపొయి మంచి జీవితాన్ని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లొంగిపోయిన ముగ్గురికి కొంత నగదను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్కిల్ ఇన్‌స్సెక్టర్ నల్లగట్ల వెంకటేశ్వర్లు, సిఆర్పిఎఫ్ డిఎస్పి రేవతి, సిఆర్పిఎఫ్ సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ రవికుమార్‌తో పాటుగా సేష్టన్, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Three maoists surrender in dummugudem