Home తాజా వార్తలు చెట్టును ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

చెట్టును ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

 

Car Accident

 

బిక్కనూరు: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులలో ఒక మహిళ ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నవీపేట ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గ్యాస్ కట్టర్‌తో కారు భాగాలను తొలగించి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టమ్‌ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

Three Members Dead Car Collided to Tree in Kamareddy