Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తిరుపతికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

తిరుపతికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

 

అమరావతి: కడప జిల్లా రైల్వే కోడూరు మండలం రఘవరాజపురం గ్రామ శివారులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితులు రంగారెడ్డి జిల్లా కంకల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తమ స్వగ్రామం నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

 

Three Members Dead in Car Accident in Kadapa Dist