Home వనపర్తి పిడుగుపాటుకు ముగ్గురు కూలీలు మృతి

పిడుగుపాటుకు ముగ్గురు కూలీలు మృతి

                    Died

ఆత్మకూరు: పిడుగు పాటుకు ముగ్గురు కూలీలు మృతి చెందిన సంఘటన వన పర్తి జిల్లా ఆత్మకూరు మండలం బాలకిష్టాపూర్ లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామా నికి చెందిన వ్యవసాయ కూలీలు, సమీప బంధు వులు ఈదన్న(45), పరమేష్(25), లక్ష్మన్న (40),కొండన్న(40), వెంకటన్న(46) కట్టెలు కొట్టేందుకు వ్యవసాయ పొలంలోకి వెళ్లారు. శు క్రవారం మధ్యాహ్నం భారీ వర్షం రావడంతో అంతా అక్కడే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు.

ఈ స మయంలో చెట్టుపై ఒక్కసారిగా పిడుగు పడడం తో ఈదన్న, పరమేష్, లక్ష్మన్న అక్కడికక్కడే మృ తి చెందారు. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అక్కడే ఉన్న మరి కొందరు రైతులు ఇది గమనించి అపస్మారక స్థితి లో ఉన్న ఇద్దరిని ఆత్మకూర్ ప్రభుత్వ సివిల్ ఆసు పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎం ఎల్‌ఎ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, వనపర్తి ఆర్‌డిఒ చంద్రశేఖర్, ఆత్మకూర్ సిఐ శంకర్, తహసీల్దార్ మోహన్‌లు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు.