Home జనగామ తెగిపడిన విద్యుత్ తీగలు: ముగ్గురికి గాయాలు

తెగిపడిన విద్యుత్ తీగలు: ముగ్గురికి గాయాలు

Current-Wires

గుండాల: జనగామ జిల్లా గుండాల మండలం తుర్కలషాపురంలో గురువారం వేకువజామున విషాదం చోటుచేసుకుంది. ఆరు బయట నిద్రిస్తున్న వారిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గ్రామంలో చాలా చోట్ల విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని, కరెంటు స్తంభాలు వంగిపోతున్న విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యుత్ అధికారులపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు మేల్కొని  విద్యుత్ స్తంభాలను, తీగలను సవరించాలని కోరుతున్నారు.