Home జాతీయ వార్తలు కశ్మీరులో ఎదురుకాల్పులు

కశ్మీరులో ఎదురుకాల్పులు

Three Militants One Cop Killed In Two Encounters
ముగ్గురు ఉగ్రవాదులు, ఒక పోలీసు మృతి

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బుడ్గామ్, షోపియా జిల్లాలలో జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల సంఘటనల్లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు, ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. బుడ్గామ్ జిల్లా బీర్వా ప్రాంతంలోని జనిగమ్ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కాగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు చేపట్టడంతో భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పులలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించినట్లు అధికారులు చెప్పారు. షోపియా జిల్లాలోని బడిగామ్ వద్ద భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వీరిని ఇంకా గుర్తించవలసి ఉందని అధికారులు చెప్పారు.