Tuesday, September 26, 2023

వీడిన ముగ్గురి హత్యల మిస్టరీ

- Advertisement -
- Advertisement -

నిందితుడి పట్టివేత
నిందితుడినుంచి చరవాణి, నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సిపి కార్తికేయ

Three Murders mystery

మన తెలంగాణ/నిజామాబాద్: డిచ్‌పల్లి మండలం లో ఈనెల 7న అర్ధరత్రి డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామశివారులో జాతీయరహదారిపక్కన అప్రోచ్ రో డ్డును ఆనుకునిఉన్న దష్మీష్ హార్వెస్టర్ మెకానిక్ షెడ్ లో జరిగిన ముగ్గురి హత్యల మిస్టరీని చేదించినట్లు సిపి కార్తికేయ వెల్లడించారు. ఆదివారం సాయం త్రం స్థానిక జిల్లాపోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిపి ముగ్గురి హత్యకేసు వివరాలను వె ల్లడించారు. ఈ ముగ్గురిహత్య కేసులను ప్రత్యేకంగా భావించి అడిషనల్ సిపి స్వామిని ప్రత్యేక దర్యాప్తు అధికారిగా ఎసిపి నిజామాబాద్ ఎ.వెంకటేశ్వర్‌ను ద ర్యాప్తు అధికారిగా నియమించి మూడు ప్రత్యేక బృం దాలుగా విడివిడిగా ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని తెలిపారు. అందుబాటులో గల సాక్షాధారాల ఆధారంగా వివిధ కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేసి జిల్లాలో పలు చోట్ల ఇలాంటి ఘోర నేరాలకు పాల్పడిన పాత నేరస్తుల వివరాలను సేకరించ డం జరిగిందన్నారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో ప్రత్యేక బృందాలు పాత నేరస్తుల ఇళ్ల వద్దకు వెళ్లి చెక్ చేస్తుండగా అదేక్రమంలో నిజాఆబాద్ పట్టణంలోని గాజుల్‌పేటవద్ద గంధం శ్రీనివాస్ అనే పాత నేరస్తుడి ఇంటిలో తనిఖీలు చేయడంతో నిందితుడు నేరంచేసినట్లు అంగీకరించాడని తెలిపారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ పంజాబ్‌కు చెందిన మెకానిక్ హర్పాల్‌సిం గ్, జోగిందర్‌సింగ్, సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బోజ్యానాయక్ తండాకు చెందిన బానోత్ సునీల్ అనే చెందిన ముగ్గురు వ్యక్తును అర్ధరాత్రివేళ నిజామాబాద్ పట్టణంలోని గాజుల్‌పేటకు చెందిన పాత నేరస్తుడైన గంధం శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ హత్యలకు కారకుడని తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. ఈ హత్యలపై అన్ని కోణాల్లో విచారణ జరిపి న అనంతరం పాత నేరస్తులను విచారించడంతో వా రిలో ఇదివరకు డబ్బులకోసం నేరాలు చేసి జైలుకు వెళ్లి ఇటీవల విడుదలైన శ్రీకాంత్‌ను అనుమానించి అతని ఇంటిలో పోలీసులు తనిఖీలు చేయగా అతని ఇంట్లో దుస్తులపై రక్తం మరకలు గల షర్టు గోడకు వే లాడదీసీ ఉండడం గమనించి శ్రీకాంత్‌ను విచారించ గా డిచ్‌పల్లి మండలం నడిపల్లిగ్రామ శివారులో హా ర్వెస్టర్ మెకానిక్‌షాపులో జరిగిన మూడు హత్యలను తానే చేశానని, అక్కడగల సుత్తెతో మొఖంపై బలం గా కొట్టిచంపి, వారివద్ద గల డబ్బు, సెల్‌ఫోన్లను ఎ త్తుకువచ్చానని తానొక్కడినే ఈహత్యలు చేశానని నిం దితుడు నేరాంగీకారం చేశాడని, నిందితుడి వద్దనుం చి ఒక సెల్‌ఫోను, తన ఇంటి పక్కన వారినుంచి రెం డు స్మార్ట్ సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోవడంజరిగిందని,

నేరస్తుడు ఉపయోగించిన కట్టె, కామగల సుత్తె ను స్వాధీనంచేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ హత్యలు చేసిన నిందితుడు బుడిగె జంగంకు చెందిన గంధం శ్రీకాంత్ (21) వృత్తిరీత్యా చెత్త ఏరుకునేవాడని, చిన్నతనం నుంచి నిజామాబాద్ పట్టణం, చు ట్టుపక్కల దొంగతనాలుచేసి పట్టుబడి జువైనల్ హోం కి వెళ్లివచ్చాడని తెలిపారు. స్థానిక హమాల్‌వాడి సా యిబాబా గుడిలో వాచ్‌మెన్‌ను ఇనుప రాడ్‌తో తలపై కొట్టి గాయపరిచి గుడిలోని హుండీని దొంగిలించుకపోయాడని, ఈకేసులో మూడేళ్ల జైలుశిక్ష అనుభిఇం చి గత రెండు నెలలకిందట విడుదలయ్యాడని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అడిషనల్ ఎస్పీ టి.స్వామి, నిజామాబాద్ ఎసిపి వెం కటేశ్వర్లు, డిచ్‌పల్లి సిఐ రఘునాథ్,టౌన్ సర్కిల్ సిఐ సత్యనారాయణ, సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ, కృ ష్ణ, హెడ్‌కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుల్‌లు లిం గం, రాజేశ్వర్‌గౌడ్, కేర్బాజీ, గబ్బర్‌సింగ్‌లను ప్రతేకంగా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News