Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

Three People Died In Road Accident At AP పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ లోని  పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉగంటూరు మండల పరిధిలోని బాదంపుడి వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలిలోనే చనిపోయారు.  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కారు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కారు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియరాలేదని, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.