Home కరీంనగర్ వడదెబ్బతో ముగ్గురి మృతి

వడదెబ్బతో ముగ్గురి మృతి

sun-stockకరీంనగర్:జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు వృద్ధురాళ్లతో పాటు ఒక మహిళ కూలీ పనులకు వెళ్లి మృతి చెందారు. హుజూరాబాద్ పట్టణంలోని గాంధీనగర్- బుడ్గజంగాలకాలనీకి చెందిన తూర్పాటి మల్లవ్వ(65) ఆదివారం రాత్రి 11 గంటలకు, సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన కొండ లచ్చమ్మ(90) సోమవారం మృతి చెందారు. గత వారం రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండడంతో వడగాలులకు వీరిద్దరూ తీవ్రమైన అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జమ్మికకుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన మహిళ అడ్లూరి(45) ఆదివారం కూలీ పనులకు వెళ్లి అస్వస్థతకకు గురైంది. వెంటనే జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి చేయ్యి జరడంతో ఆదివారం రాత్రి 11 గంటలకు మరణించింది.