Home రంగారెడ్డి ఆటో బోల్తా: ముగ్గురికి తీవ్ర గాయాలు

ఆటో బోల్తా: ముగ్గురికి తీవ్ర గాయాలు

Three Persons Injured in Auto Accident
కడ్తాల్: హైద్రాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై కడ్తాల్ మండల కేంద్రంలోని టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం మధ్యాహ్నాం ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులతో పాటు రోడ్డుప్రక్కన నిలిచి ఉన్న మహిళా రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. కడ్తాల్ ఎస్‌హెచ్‌వో సుందరయ్య తెల్పిన వివరాల ప్రకారం… కందుకూర్ మండలం నేద్‌నూర్ గ్రామానికి చెందిన దంపతులు నల్లాల పెంటయ్య, లక్ష్మమ్మ దంపతులు. ఆటోలో వీరు పని నిమిత్తం ఆమనగల్లు వైపు వెల్తుండగా టోల్‌ప్లాజాకు సమీపంలో ఆటో అదుపుతప్పి ప్రక్కనే ఉన్న కల్వర్టును ఢీకొని క్రిందికి దూసుకెల్లింది. ఇదే సమయంలో తమ పొలం వద్ద రహదారి ప్రక్కనే నిలిచి ఉన్న కడ్తాల్ గ్రామానికి చెందిన సూద సత్యమ్మకు ఆటో ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పెంటయ్య, లక్ష్మమ్మలతో పాటు రహదారి ప్రక్కన నిలిచి ఉన్న సత్యమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలిసులు బాధితులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం హైద్రాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలిసులు తెలిపారు.