Home అంతర్జాతీయ వార్తలు కాల్పుల్లో ముగ్గురు మృతి

కాల్పుల్లో ముగ్గురు మృతి

Shootingవాషింగ్టన్ : కాలిఫోర్నియాలో సోమవారం ఉదయం దుండగులు కాల్పులు జరిపారు. గిల్‌రాయ్‌లోని గార్లిక్ ఫెస్ట్‌లో దుండగులు కాల్పులు జరపడంతో  ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.  మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. కాల్పుల ఘటనతో ఫెస్ట్ కు హాజరైన ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ కాల్పుల ఘటన వెనుక ఉగ్ర కోణం ఉందా అన్న అనుమానంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో గిల్ రాయ్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

Three Shot Dead in America On Monday