Home తాజా వార్తలు అక్కా చెల్లెళ్లు అదృశ్యం

అక్కా చెల్లెళ్లు అదృశ్యం

Three Sisters Missing in Hyderabad

హైదరాబాద్ : పని కోసం బయటకు వెళ్లిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు అదృశ్యం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన కైశల్ కిశోర్ బాలపూర్ మండలం శ్రీరామకాలనీలో ఉంటున్నాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు నందిని కుమారి (23), ముష్కాన్ కుమారి (14), కాంచన్ కుమారి (16)లు ఉన్నారు. శ్రీరామకాలనీలో ఉన్న సింగానియా చాక్లెట్ల కంపెనీలో వీరు పని చేస్తున్నారు. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఈనెల 14న ఉదయం పని కోసం కంపెనీకి వెళ్లారు. తిరిగి వారు ఇంటికి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Three Sisters Missing in Hyderabad