Saturday, April 20, 2024

ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -
Three Students Committed Suicide in Telangana
ఇంటర్ పరీక్షలు తప్పడంతో ఇద్దరు, డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తారేమోనని మరొకరు బలవన్మరణం

గజ్వేల్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఫెయిల్ అయిన ఇద్దరు, డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తారేమోనని మరొక విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాలో ఫలితాలు రాకముందే ఫెయిల్ అవుతాననే అనుమానంతో ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లాలో ఓ విద్యార్థి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తారేమోననే భయంతో విషం తాగి చనిపోయాడు. సిద్దిపేట జిల్లాలో సీనియర్ ఇంటర్ విద్యార్థిని ఫెయిల్ కావడంతో ఉరి వేసుకొని మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా, మండల కేంద్రమైన చేగుంటకు చెందిన కుర్ర పెంటమ్మ రమేష్ దంపతుల కూతురు శిల్ప(17) మోడల్ స్కూల్‌లో ఇంటర్మీయెట్ మొదటి సంవత్సరం బైపిసి చదువుతోంది. గురువారం ఇంటర్ ఫలితాలు వస్తాయని తెలిసి, తాను ఎలాగూ ఫెయిల్ అవుతానని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ తెలిపారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మృతురాలు శిల్ప ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల అశోక్(19) అనే విద్యార్థి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తే తాను ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల మల్లేశం కుమారుడు అశోక్ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు నిర్వహిస్తారనే భయంతో రెండు రోజులుగా ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం విషం తాగాడు.

గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున అశోక్ మృతిచెందాడు. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ పట్టణానికి చెందిన కుతాడి శ్రీశైలం కూతురు ప్రవళిక(18) పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ బైపిసి సెకండ్ ఇయర్ చదువుతోంది. గురువారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు ప్రవళికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News