Home తాజా వార్తలు బూర్గుల వద్ద రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

బూర్గుల వద్ద రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

Road Accidentరంగారెడ్డి : షాద్‌నగర్ మండలం బూర్గుల టోల్‌గేట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు యువకులు చనిపోయారు.  వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. తమ స్నేహితుడి సోదరి పెళ్లికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో రోడ్డుప ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Three Youngmen Dead In Road Accident At Burgula