Home సినిమా వీడియోలు ఫిరంగి ఫిదా చేశాడు.. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ట్రైలర్…

ఫిరంగి ఫిదా చేశాడు.. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ట్రైలర్…

Thugs Of Hindostan Official Trailer Released

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ బాలీవుడ్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ప్రచారం జోరుగా సాగుతోంది. అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్, కత్రినాకైఫ్, సనా షేక్ వంటి భారీ తారాగణంతో యశ్‌రాజ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘ధూమ్ 3’ ఫేమ్ విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాప్ టెక్నిషియన్లతో హాలీవుడ్ స్టాండర్డ్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో ఆద్యంతం విజువల్స్ భారీ పనితనంతో మైమరించాయి. 1795లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు సముద్ర మార్గం గుండా భారతదేశంలోకి ఆయుధాల వ్యాపారం పేరుతో అడుగుపెట్టినప్పటి దృశ్యాల్ని అద్భుతంగా చూపించారు. ట్రైలర్‌లో ఆద్యంతం డార్క్ షేడ్‌తో నాటి వాతావరణాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఇక పాత్రధారుల విషయానికి వస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ అరాచకాల్ని ఎదిరించే బందిపోట్లుగా అమితాబ్‌బచ్చన్, సనాషేక్‌లు కనిపించారు. సనా షేక్ వీరోచిత పోరాటం, బాణాలు సంధించే దృశ్యాలు చూస్తుంటే ఆమె పాత్ర ప్రాముఖ్యత పెద్దదేనని అర్థమవుతోంది. మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ నటించిన ఫిరంగి పాత్ర సినిమాకే హైలైట్ కానుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ పాత్ర నారదుడి తరహా పాత్ర. నారదుడు ముల్లోకాల్లో తిరుగుతూ అందరికీ సమాచారాన్ని చేరవేస్తూ లోక కళ్యాణానికి పాల్పడినట్టే భారతదేశానికి మేలు చేసే పాత్రల్లో కనిపిస్తున్నాడు అమీర్. ముఖ్యంగా గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం యశ్‌రాజ్ సంస్థ భారీగానే ఖర్చు చేసిందని ట్రైలర్ చెబుతోంది. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం భాషలలోనూ విడుదల చేయనున్నారు. నవంబర్ 8న దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తగా అన్ని వర్షన్లలో విడుదల కానుంది.