Home ఆంధ్రప్రదేశ్ వార్తలు బాలుడు కిడ్నాప్… లభించని ఆచూకి…

బాలుడు కిడ్నాప్… లభించని ఆచూకి…

Kidnap

 

మండపేట : సోమవారం రాత్రి సాయిధరణి అపార్ట్‌మెంట్‌ వద్ద జరిగిన బాలుడి అపహరణ ఘటన తీవ్ర కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట సమీపంలోని విజయలక్ష్మీ నగర్‌లో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అపార్ట్‌మెంట్‌లో అమ్మమ్మతో పాటు వెళ్తున్న జశిత్‌ అనే ఐదేళ్ల బాలుడిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అపహరించారు.

జశిత్‌ తల్లిదండ్రులిద్దరూ బ్యాంకు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కుమారుడి అపహరణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ కోసం ఏడు బృందాలతో గాలిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం హస్మీ వెల్లడించారు. అన్ని చెక్‌పోస్టులు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్లలో అప్రమత్తం చేశామన్నారు.

అపహరణకు ఆర్థిక లావేదేవీలే కారణమనే కోణంలోనూ విచారిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు నిందితుల నుంచి ఎలాంటి ఫోన్‌ రాలేదన్నారు. నిన్న రాత్రి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన సమయంలో నిందితులు బాలుడిని అపహరించారని.. కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు చెప్పారు.

 

Thugs who Kidnapped a Boy named Jashit