Wednesday, April 24, 2024

పిడుగుపడి సబ్ స్టేషన్‌లో చెలరేగిన మంటలు

- Advertisement -
- Advertisement -

substation

నార్కెట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని 220 కేవీ సబ్ స్టేషన్‌లో పిడుగుపడి మంటలు చెలరేగిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వెంటనే సంఘటన స్థలాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించి విలేకరులతో మాట్లాడుతూ పిడుగుపడి సబ్ స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడంతో అగ్ని ప్రమాదం సంభవించిందన్నారు. ఈ ప్రమాదంతో సుమారు 50 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు.

సబ్ స్టేషన్ పేలిపోవడం వలన నార్కట్‌పల్లి, నక్కలపల్లి, ఈదులూరు, నెమ్మని సబ్ స్టేషన్ మండలాలపై ప్రభావం పడుతుందన్నారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ, జెన్‌కో ఎస్‌ఈలతో మాట్లాడి నార్కట్‌పల్లి మండలంలో సింగిల్‌పేస్ కరెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రావడానికి సుమారు వారం రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించినట్లు ఆయన తెలిపారు.

Thunderbolt Fires in Substation At Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News