Home Default ‘ నా ఆయుష్షు 110 ఏళ్లు…’

‘ నా ఆయుష్షు 110 ఏళ్లు…’

Dalai Lamaఢిల్లీ : టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై వదంతులు వస్తుండడంతో ఆయన భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై దలైలామా స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆయన తన భక్తులకు సూచించారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తాను 110 ఏళ్లు బతుకుతానని ఆయన పేర్కొన్నారు. ధర్మరక్షక దేవత పాల్ డెన్ లామో తనకు కలలో కనిపించిందని, తాను 110 ఏళ్లు బతుకుతానని చెప్పిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దలైలామా వయస్సు 84 ఏళ్లు. భారత్ లోని ధర్మశాలలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఇక్కడి నుంచే టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

Tibetan Buddhist Religious Teacher Dalai Lama Is Ill